Breaking News

98వ ఆస్కార్‌: ఆ సినిమాకు అత్యధికంగా 6 అవార్డులు

Published on Mon, 03/16/2026 - 05:22

హాలీవుడ్‌లో ఆస్కార్‌ పండగ సందడి కనిపించింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో మార్చి 16న ఉదయం ఘనంగా జరిగింది. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్‌ కాస్టింగ్‌ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. 

అలా ఈసారి 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. 'వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌' మూవీకి అత్యధికంగా 6 పురస్కారాలు వరించాయి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 30 వరకు విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిగణించారు. ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం కేటగిరీలో రెండు చిత్రాలకు పురస్కారాలు వరించడం విశేషం! ఆస్కార్‌ స్టేజీపై తళుక్కుమన్న బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రంగా 'సెంటిమెంటల్‌ వాల్యూ'ని ప్రకటించింది.

ఆస్కార్‌ విజేతల జాబితా

  • ఉత్తమ చిత్రం : వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

  • ఉత్తమ నటుడు: మైఖెల్‌ బి. జోర్డాన్‌ (సిన్నర్స్‌)

  • ఉత్తమ నటి: జెస్సీ బక్లే (హామ్నెట్‌)

  • ఉత్తమ దర్శకుడు: పాల్‌ థామస్‌ అండర్సన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

  • ఉత్తమ సహాయ నటుడు: షాన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

  • ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్‌ (వెపన్స్‌)

  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: గోల్డెన్‌ సాంగ్‌ (కె-పాప్‌ డిమాన్‌ హంటర్స్‌)

  • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్‌ వాల్యూ (నార్వే దేశపు సినిమా)

  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్‌ డురాల్డ్‌ అర్కపా (సిన్నర్స్‌)

  • ఉత్తమ ఎడిటింగ్‌: యాండీ జుర్గెన్‌సన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

  • ఉత్తమ సంగీతం: లుడ్విగ్‌ గోరాన్సన్‌ (సిన్నర్స్‌)

  • ఉత్తమ సౌండ్‌: గరేత్‌ జాన్‌, ఏఐ నెల్సన్‌, గ్వెన్‌డాలిన్‌ యేట్స్‌ విర్టల్‌, గేరీ ఎ.రిజో, జాన్‌ పెరల్ట (ఎఫ్‌ 1)

  • ఉత్తమ కాస్టింగ్‌: కసాండ్రా కులుకుందిస్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

  • ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్‌ నోబడీ ఎగైన్‌స్ట్‌ పుతిన్‌

  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ఆల్‌ ద ఎంప్టీ రూమ్స్‌ 

  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: జో లెటరి, రిచర్డ్‌ బనెహం, ఎరిక్‌ సైండన్‌, డేనియల్‌ బారెట్‌ (అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌)

  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తమర డేవెరల్‌, షేన్‌ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్‌)

  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ర్యాన్‌ కూగ్లర్‌ (సిన్నర్స్‌)

  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: పాల్‌ థామస్‌ అండర్సన్‌ (వన్‌ బాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

  • ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: మైక్‌ హిల్‌, జోర్డాన్‌ సామ్యూల్‌, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్‌)

  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: కేట్‌ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్‌)

  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ద గర్ల్‌ హు క్రైడ్‌ పర్ల్స్‌

  • ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం: కె-పాప్‌ డిమాన్‌ హంటర్స్‌

  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ద సింగర్స్‌, టూ పీపుల్‌ ఎక్స్‌చేంజింగ్‌ సలైవా

చదవండి: ఉత్తమ చిత్రంగా నిలిచిన "వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌" సినిమా రివ్యూ

Videos

వివేక ను చంపించాల్సిన అవసరం ఏంటి? " వైఎస్ సునీత వ్యాఖ్యలపై రాచమల్లు స్ట్రాంగ్ రిప్లై

రానున్న 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

రేవంత్ చేతకాని తనం వల్ల తెలంగాణకు అన్యాయం

మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్

సునీత సంచలన ఆడియో బయటపెట్టిన వైఎస్ అవినాష్ రెడ్డి

రాజశేఖర్ ను వివేకా హత్యకు ముందు రోజున ఎందుకు కాణిపాకం పంపించారు

SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ

పుట్టాపై సీరియస్... BR నాయుడుపై మాత్రం నో సీరియస్... జడ శ్రవణ్ సెటైర్లు

అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భేటీ

తెలంగాణలో IAS-IPSల కొరత

Photos

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)