మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
టాలీవుడ్‌లో 19 ఏళ్ల హీరోయిన్.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
Published on Wed, 06/18/2025 - 07:34
సాధారణంగా హీరోయిన్లు అనగానే చాలామందికి ఓ అభిప్రాయం ఉంటుంది. గ్లామర్ చూపించో లేదంటే యాక్టింగ్ చేసో ఛాన్సులు కొట్టేస్తుంటారు అని అనుకుంటారు. అయితే వీళ్లలో కొందరు మాత్రం మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఒకరిలోనే చాలా టాలెంట్స్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే 'మ్యాడ్'లో ఓ హీరోయిన్‌గా చేసిన అనంతిక అనే అమ్మాయి కోసం.
రీసెంట్‌గానే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె పూర్తి పేరు అనంతిక సనీల్ కుమార్. 19 ఏళ్ల ఈ కేరళ కుట్టి.. 2015 నుంచి సినిమాలు చేస్తోంది. తొలుత మిలీ, లాల్ సలామ్, రైడ్ అనే తమిళ సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో ఓ హీరోయిన్‌గా చేసి హిట్ కొట్టిన తర్వాత దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే మరో తెలుగు మూవీలో లీడ్ రోల్ అవకాశమొచ్చింది. కాకపోతే ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. అయితేనేం తెలుగులో బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసిన '8 వసంతాలు' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')
జూన్ 20న '8 వసంతాలు' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతిక తన టాలెంట్స్ అన్నీ బయటపెట్టింది. ఇన్ని రోజులు ఈమె ప్రతిభావంతురాలు అనే టాక్ ఉంది గానీ ఇప్పుడు దాన్ని రియాలిటీలో చూపించింది. దీంతో ఈమె గురించి ఇప్పుడు టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం లా(న్యాయవాది) కోర్స్ చేస్తున్న అనంతిక.. క్లాసికల్ డ్సాన్స్ చేస్తుంది. కరాటేలో ఈమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. కేరళకు చెందిన కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా వచ్చు. కత్తి ఫైటింగ్‌లోనూ ఈమె సిద్ధహస్తురాలే. అలానే కేరళ సంప్రదాయంలో ఒకటైన చెండా (డ్రమ్స్) కూడా బాగానే వాయిస్తుంది. ఇలా అనంతిక ఇన్నింట్లో ప్రతిభావంతురాలు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 19 ఏళ్లకే ఇలా ఉందంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని నేర్చుకుంటుందో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)
#AnanthikaSanilkumar:
• A trained classical dancer 💃
• Black belt in Karate 🥋
• Skilled in Kalaripayattu 🥷
• Skilled in sword fighting 🗡️
• Plays the Chenda (percussion) 🥁
• An actor 👩🎤
• A law student 👩🎓
And she’s just 19 years old! 🫡 pic.twitter.com/crowkzdA6X— Movies4u Official (@Movies4u_Officl) June 17, 2025
Tags : 1