రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!
Breaking News
ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! 40 రోజుల్లోనే..
Published on Thu, 09/17/2026 - 14:49
నీమ్ కరోలి బాబా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ‘హనుమాన్ అంశ్’. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా రూ.291.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 40 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోబినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో విశ్వాసం, ప్రేమ, సేవ, భక్తి వంటి అంశాలను చూపించారు.
ముగ్గురు మహిళల పెట్టుబడి..
‘హనుమాన్ అంశ్’ నిర్మాణంలో ముగ్గురు మహిళలు కీలకంగా వ్యవహరించారని మీకు తెలుసా. రాగిణి సోనా, నమ్రత జీ. సింగ్‌తో పాటు 21 ఏళ్ల అనుప్రియా నగర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఒక్కొక్కరు సుమారు రూ.60 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టామని అందులో ఒకరైన అనుప్రియా వివరించారు. అయితే తాను సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ప్రాజెక్టులో లేనని అనుప్రియా స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దశలో తాను చిత్ర బృందంలోకి వచ్చినట్లు తెలిపింది. ‘నేను ముగ్గురు మహిళా నిర్మాతల్లో చిన్నదాన్ని. షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలోకి వచ్చాను. పోస్ట్ ప్రొడక్షన్ కోసం డబ్బులు అవసరమైన సమయంలో నా వంతు పెట్టుబడి పెట్టాను’ అని అనుప్రియా తెలిపింది.
దర్శకుడు ఏమన్నారంటే?
అనుప్రియా పాత్రపై దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా స్పందించారు. ఆమె తమ బృందంలో నిర్మాతేనని, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచారని చెప్పారు. అయితే అనుప్రియా కథ రాశారని, సినిమాను ఆమె క్యూరేట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఆమె స్వయంగా ఆ విషయాన్ని ఖండించారని తెలిపారు. ఇక అసలు నిర్మాతలైన రాగిణి సోనా, నమ్రతా సింగ్ కూడా సినిమాకు ఎంతో కష్టపడ్డారని విశాల్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?)
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆఫర్లు
థియేటర్లలో ఊహించని విజయాన్ని అందుకోవడంతో ‘హనుమాన్ అంష్’పై ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒకటి, రెండు కాకుండా మూడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ సినిమా హక్కుల కోసం సంప్రదిస్తున్నట్లు నిర్మాత రాగిణి సోనా వెల్లడించారు. అయితే ఈ సినిమాను మొదటి నుంచే ఓటీటీ కోసం తెరకెక్కించలేదని ఆమె స్పష్టం చేశారు. పెద్ద తెరపైనే ప్రేక్షకులు సినిమాను చూడాలనేది తమ ఉద్దేశమని తెలిపారు.
22 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..
దర్శకుడు విశాల్ చతుర్వేది ప్రకారం.. తొలుత 26 రోజుల షూటింగ్‌కు బడ్జెట్ సిద్ధం చేసుకున్నారట. అయితే ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో 22 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేశారట. పరిమిత వనరులతో సినిమాను పూర్తి చేయడం తమకు పెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. కాగా అనుమన్ అంశ్ తెలుగులో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది.
Tags : 1