Breaking News

షూటింగ్స్ అంటే ప్రాణాలతో చెలగాటమేనా?

Published on Wed, 07/08/2026 - 07:32

వెండితెరపై మనల్ని అలరించేందుకు నటీనటులు చేసే సీన్స్‌ కొన్నిసార్లు వారి ప్రాణాలకే ముప్పుగా మారుతుంటాయి. సినిమా షూటింగుల్లో డూప్ లేకుండా స్టంట్లు చేయడం, ప్రమాదకరమైన సన్నివేశాల్లో పాల్గొనడం బాలీవుడ్ అగ్ర తారలను చావు అంచుల్లోకి నెట్టేసింది. ‘జాగృతి’, ‘పత్తర్ కే ఫూల్’ తదితర చిత్రాల సమయంలో తాను దాదాపు మరణానికి దగ్గరగా వెళ్లానని ఆమధ్య సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. అయితే కేవలం సల్మాన్‌ మాత్రమే కాదు.. బాలీవుడ్‌కు చెందిన మరికొందరు స్టార్ హీరో హీరోయిన్లు కూడా షూటింగ్ సెట్స్‌లో ప్రమాదాల నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ సల్మాన్ ఖాన్
‘తేరే నామ్’ చిత్ర షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్‌కు ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది. ఒక సన్నివేశం కోసం ఆయన రైలు పట్టాలపై, రైలుకు ముందు నడుస్తూ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో సల్మాన్ అదుపు తప్పి కింద పడిపోయారు. రైలు ఆయనకు అత్యంత సమీపంగా దూసుకువెళ్లింది. తృటిలో ప్రాణాపాయం తప్పిన ఈ భయంకరమైన అనుభవాన్ని సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకుంటూ షాక్‌కు గురిచేశారు.

సాహసాల వేళ అక్షయ్ కుమార్‌కు ప్రమాదం
బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ తన సినిమాల్లోని చాలా స్టంట్లను స్వయంగా చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన ‘ఖిలాడియోం కా ఖిలాడీ’, 'సూర్యవంశీ' తదితర చిత్రాల షూటింగ్ సమయంలో తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఒక స్టంట్ చేస్తున్నప్పుడు ఆయనకు తీవ్రమైన గాయాలై, ప్రాణాపాయ పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

యాభై అడుగుల ఎత్తు నుండి పడ్డ హృతిక్ రోషన్
‘క్రిష్’ సినిమా సెట్స్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఒక ఘోర ప్రమాదం జరిగింది. కేబుల్ వైర్ సహాయంతో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, ఒక్కసారిగా ఆ కేబుల్ తెగిపోయింది. దాంతో హృతిక్ దాదాపు 50 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆ‍స్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆ గాయాల నుండి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది.

అమితాబ్ బచ్చన్ 'కూలీ' ప్రమాదం
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ‘కూలీ’ చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలియని వారుండరు. ఒక ఫైట్ సీన్‌లో పునీత్ ఇస్సార్ అమితాబ్‌పై బలమైన పంచ్ విసిరారు. ఈ దెబ్బకు అమితాబ్ అంతర్గత అవయవాలు దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరిన ఆయన, ఏకంగా 59 రోజుల పాటు మరణంతో పోరాడి, చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు.

సైఫ్ అలీ ఖాన్ బైక్‌ బ్యాలెన్స్‌ తప్పడంతో..
‘క్యా కెహనా’ సినిమా సెట్‌లో సైఫ్ అలీ ఖాన్ ఒక రోడ్డు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒక సీన్ కోసం ఆయన బైక్ నడపాల్సి ఉంది. అయితే షూట్ సమయంలో సైఫ్ బైక్‌పై నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా కిందపడి, పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాల నుంచి కోలుకోవడానికి ఆయనకు కొన్ని నెలల పాటు చికిత్స అవసరమైంది.

జీప్ ప్రమాదంలో గాయపడ్డ ఐశ్వర్యా రాయ్
బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా ‘ఖాకీ’ చిత్ర షూటింగ్ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఒక సీన్ కోసం ఆమె జీపులో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ జీపు డ్రైవర్ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, ఐశ్వర్య జీపులో నుండి బయటకు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.

ఇది కూడా చదవండి: హీరోయిన్‌ అందానికి దాసోహమై..

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)