Breaking News

తమిళ్‌లో మెప్పిస్తున్న తెలుగు చిన్న సినిమా

Published on Sat, 12/28/2024 - 14:10

తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం '35 చిన్న కథ కాదు'.. నివేదా థామస్‌, అరుణ్‌దేవ్‌ పోతుల, విశ్వదేవ్‌, గౌతమి, ప్రియదర్శిని, దర్శకుడు కే.భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నంది కిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. సృజన్‌ వాల్టైర్‌ ప్రొడక్షన్‌న్స్‌ పతాకంపై సృజన్‌ వరబోల, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి, కలసి నిర్మించిన ఈ చిత్రం గత సెప్టెంబర్‌లో విడుదల మంచి విజయాన్ని సాధించింది. 

మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందిన బలమైన కథ, కథనాలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ముఖ్యంగా పిల్లల విద్య, వారి ఇష్టాఇష్టాలు వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నివేద థామస్‌ సహజత్వంతో కూడిన నటన చిత్రానికి అదనపు బలంగా నిలిచింది. ఆమె ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం విశేషం. 

తెలుగులో విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం ఇప్పుడు '35 చిన్న విషయం ఇల్లై' పేరుతో తమిళంలోకి అనువాదమై క్రిస్మస్‌ సందర్భంగా కోలీవుడ్‌లో విడుదలైంది. దీన్ని తెలుగులో నిర్మించిన నిర్మాతలే తమిళంలోనూ విడుదల చేశారు. దీనికి నికేశ్‌ బొమ్మి చాయాగ్రహణం, వివేక్‌సాగర్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి తమిళంలో కూడా మంచి ఆదరణ దక్కడం విశేషం.  తెలుగు వర్షన్‌ ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)