Breaking News

ఓటీటీలో ఈ ఏడాది టాప్‌ పెర్ఫార్మెన్స్‌ ఈ బ్యూటీలదే

Published on Tue, 12/30/2025 - 21:16

వెండితెరకు పోటీగా మారింది ఓటీటీ. ఈ క్రమంలోనే తారలు అక్కడ కూడా తమ సత్తా చాటుతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌కు భిన్నంగా ఓటీటీ వేదికలపై ప్రదర్శితమవుతున్న చిత్రాల్లో మహిళల అభినయ సామర్ధ్యం మరింతగా కనిపిస్తోంది. అదే క్రమంలో ఈ ఏడాది ఓటీటీ చిత్రాల్లో పలువురు తారల నటన వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తారలు ఎవరెవరంటే?

సాన్యా మల్హోత్రా..
పితృస్వామ్యాన్ని తీవ్రంగా విమర్శించిన మిస్ట్రెస్‌ చిత్రంలో, సాన్యా మల్హోత్రా నటన ఆకట్టుకుంటుంది. సంతోషాల వధువు నుంచి ఒక ఇంటికి బానిసగా మారే క్రమంలో సన్యా నటన ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నిర్మించిన చిత్రం ఇది.

యామి గౌతమ్‌...
ఉత్కంఠభరితమైన రొమాంటిక్‌ కామెడీ ధూమ్‌ ధామ్‌. ఇందులో నటి యామి గౌతమ్‌ నవ వధువుగా నటించింది, ఆమె వివాహం జరిగిన æ రాత్రిని అంచనాను తలక్రిందులుగా చేసి, నెర్వస్‌గా ఉండే తప భర్తతో నగరం అంతటా పిచ్చిగా తిరిగే  థూమ్‌ థామ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

మియా మేల్జర్‌...
స్టోలెన్‌ చిత్రంలో తన బిడ్డ కిడ్నాప్‌ కు గురైన పరిస్థితిలో ఒక నిస్సహాయ స్త్రీ పాత్రను మియా మేల్జర్‌ పోషించింది.  తాను ఎదుర్కొంటున్న పరిస్థితి హింసాత్మకంగా మారినప్పుడు అదే నిస్సహాయ మహిళ తెగువను చూపుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.

నీనా గుప్తా..
ఆచారీ బా చిత్రంలో గుజరాతీ వితంతువుగా సీనియర్‌ నటీమణి నీనా గుప్తా  నటన  మన్ననలు అందుకుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడవచ్చు. సుగంధ ద్రవ్యాల పట్ల మక్కువ,  వివాహ జీవితంలో అసంతృప్తి ఉన్న గృహిణిగా  షీబా చద్దా... ఫ్యామిలీ డ్రామా కౌశల్జీ వర్సెస్‌ కౌశల్‌ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరుస్తుంది. ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో ఉంది.

సబా ఆజాద్‌
పీరియాడిక్‌ డ్రామా సాంగ్స్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ లో సబా సంప్రదాయవాద సమాజంలో తన గొంతును వినిపించడానికి పోరాడిన స్త్రీ స్ఫూర్తిగా కనిపిస్తుంది. ,  దీనిని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అందిస్తోంది.

ఫరీదా జలాల్‌
పదునైన, నిర్ణయాత్మక పాత్రలో ఫరీదా ఆకట్టుకుంటుంది.  మాతృమూర్తిగా ఆమె కుటుంబం ఆమెను ఆరాధిస్తుంది  భయపడుతుంది కూడా. ది గ్రేట్‌ షంసుద్దీన్‌ ఫ్యామిలీ సినిమాను జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు.

రాధికా ఆప్టే
సాలీ మొహబ్బత్‌ అనే డార్క్‌ క్రై మ్‌ థ్రిల్లర్‌లో  రాధిక ఆప్టే నటన ప్రశంసలు అందుకుంది.  ఆమె ఒక విధేయురాలైన భార్యగా మాత్రమే కాదు అడ్డంకులు ఎదురైనప్పుడు అంతే కఠినంగా... అన్ని సందర్భాల్లోనూ పూర్తిగా అమాయకంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.

దీప్తి నావల్
రాత్‌ అకేలి హై: ది బన్సాల్‌ మర్డర్స్‌లో  నటి దీప్తి నావల్‌ తనకున్న ’మంచి మహిళ అనే ఇమేజ్‌కు వ్యతిరేకంగా కనిపిస్తుంది. నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ  చిత్రాన్ని చూడవచ్చు.

హుమా ఖురేషి...
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ అందిస్తున్న ’ఢిల్లీ క్రై మ్‌ సీజన్‌ 3’లో క్రూరమైన మానవ అక్రమ రవాణాదారు మీనా (బడీ దీదీ) పాత్రలో హుమా ఖురేషి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. షెఫాలీ షా, రసికా దుగల్‌  తదితరులు కూడా  నటనకు మార్కులు పడినప్పటికీ, ఖురేషి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి, ప్రశంసలు పొందింది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)