Breaking News

ఆ ఒక్క సినిమాతో ప్రతిష్టాత్మక అవార్డ్ కొట్టేసిన నటుడు!

Published on Sun, 03/24/2024 - 14:51

చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్‌ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ కావాలనే కలను నిజం చేసుకున్న నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఐపీఎస్ కల కోసం మనోజ్ కుమార్ శర్మ కష్టపడిన తీరును చక్కగా ఆవిష్కరించారు.

ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే మెప్పించారు. తాజాగా ఈ చిత్రంలో అతని నటనకుగానూ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు ఎంపికయ్యారు. కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ చేతుల మీదుగా యాక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డ్‌ను(ఉత్తమ నటుడు) అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీటీవీ ఇండియన్ ఆఫ్‌ ది ఇయర్‌ ఈవెంట్‌లో ఈ అవార్డ్‌ను బహుకరించారు. 

కాగా..  ధరమ్ వీర్, బాలికా వధు, బాబా ఐసో వర్ ధూండో, యే హై ఆషికి వంటి కొన్ని సీరియల్స్‌లో విక్రాంత్ మాస్సే నటించారు. అంతే కాకుండా ఎ డెత్ ఇన్ ది గంజ్, ఛపాక్, హసీన్ దిల్‌రూబా, గ్యాస్‌లైట్ వంటి చిత్రాలలో కనిపించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. కాగా.. ప్రస్తుతం 12th ఫెయిల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)