Breaking News

కన్నీళ్లు తెప్పిస్తున్న విద్యార్థి కష్టాలు.. విజయ్‌, తమన్‌ సాయం

Published on Mon, 08/26/2024 - 16:37

తమిళనాడులోని కోవిల్‌పట్టికి చెందిన ఓ విద్యార్థి కుటుంబానికి దళపతి విజయ్ సాయం చేశారు. ఓ టీవీ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆ విద్యార్థి తన కుటుంబ పరిస్థితుల కారణంగా కాలేజీకి వెళ్తూనే.. కూలి పని కూడా చేస్తున్నట్లు చెప్పాడు. ఆ వీడియో కాస్త హీరో విజయ్ వరకు చేరింది. దీంతో ఆ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చుల కోసం వెంటనే రూ. 25వేలు అందించారు. ఆ విద్యార్థి చదువు విషయంలో పూర్తి బాధ్యత తనే తీసుకుంటున్నట్లు తెలిపారు.

టీవీ ఛానల్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. మార్కెట్‌ యార్డ్‌లో మూటలు మోస్తూ చదువుకుంటున్నట్లు చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే తాను చదవుకుంటూ ఈ పని చేస్తున్నట్లు చెప్పాడు. మూటలు మోయడం వల్ల తన భుజం నొప్పిగా ఉంటుందని వాపోయాడు. అయినా, తన అమ్మకు ఆసరా కల్పించేందుకే ఆ నొప్పిని భరిస్తూ మూటలు మోస్తున్నానని చెప్పాడు. కానీ తాను నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు ఆమ్మతో చెప్పలేదని తెలిపాడు. అలా రోజుకు కనీసం 5 గంటలు పని చేస్తానని చెప్పిన ఆ విద్యార్థి కొన్ని సార్లు రాత్రి బస్సు లేకుంటే సుమారు 3 కీ.మీ నడుస్తానని తెలిపాడు.

విజయ్ ఈ విద్యార్థి కుటుంబానికి తవేక ఆలయ నిర్వాహకుల ద్వారా సహాయం చేశారు. ఈ వీడియోలో విద్యార్థి తల్లి మాట్లాడుతూ.. ' నా కుమారుడి మాటలకు చలించిపోయిన విజయ్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మా అబ్బాయి కాలేజీ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును ఆయన భరిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాలేజీలో చెల్లించమని రూ. 25 వేలు ఇచ్చారు. అంతేకాకుండా మా కుటుంబానికి ఒక నెల సరిపడ ఇంటి వస్తువులను కూడా విజయ్‌ అందించారు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు.' అని విద్యార్థి తల్లి పేర్కొంది. అదేవిధంగా స్కూల్ విద్యార్థి వీడియో చూసిన ప్రముఖ సంగీత దర్శకులు థమన్ కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ విద్యార్థికి మోటార్ బైక్ కొనిస్తానని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)