Breaking News

ట్రంప్‌కు భారీ షాక్‌.. మమ్దానీ గెలుపు

Published on Wed, 11/05/2025 - 08:26

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్‌ తగిలింది. న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ(34) విజయం సాధించారు. ఎన్నికల్లో ముందు నుంచి మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మమ్దానీ ఘన విజయం అందుకున్నారు. మమ్దానీ విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. 

మేయర్‌ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్‌ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు.  కాగా, ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్‌ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్‌ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఇక.. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. 
 

 

కాగా, అక్టోబర్‌ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్‌ పోల్‌లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్‌ కర్టిస్‌ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. వామపక్ష నేత అయిన జోహ్రన్‌ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్‌ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్‌ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ మమ్దానీ విజయం సాధించడం విశేషం. 


మమ్దానీ హామీ..
జోహ్రాన్ మమ్దానీ సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్‌తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.

‘గుజరాత్‌’పై మమ్దానీ వీడియో వైరల్‌   
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్‌లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)