Breaking News

అమెరికా.. మమ్మల్ని ఆదుకోండి: జెలెన్‌ స్కీ వేడుకోలు

Published on Sun, 06/29/2025 - 19:34

రష్యా-ఉక్రెయిన్‌ యద్దాన్ని ఆపేశానని ఇది వరకే బడాయి కబుర్లు చెప్పిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అతిపెద్ద దాడిపై ఏం చెబుతారు?, ఇదే మాటను ఇప్పుడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రష్యా డాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఈ సమయంలో అమెరికా తమకు తక్షణ రక్షణ సాయం చేయాలని వేడుకుంటున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా తమ అండగా నిలబడి, రష్యాను ఎదుర్కోనేందుకు సాయం చేయాలని జెలెన్‌ స్కీ  సుదీర్ఘమైన ఉద్వేగభరిత పోస్ట్‌ పెట్టారు. 

‘మాకు రక్షణ కావాలి.  అది కూడా తక్షణమే కావాలి.  రష్యా మా దేశంలోని ప్రతీదాన్ని టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం మేము జీవన పోరాటం చేస్తున్నాం​.  స‍్మిలాలోని నివాసిత ప్రాంతంలో కూడా రష్యా భీకరమైన దాడులు చేసింది. మా ఎఫ్‌-16 పైలట్‌ రష్యా దాడుల్లో చనిపోయాడు. సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. 

వారికి భీకర దాడులు చేసే శక్తి సామర్థ్యాలు ఉండటంతో మాపై వరుస పెట్టి దాడుల చేస్తూ వస్తోంది. ఈ వారంలోనే 114 మిస్సెళ్లను, 1270 డ్రోన్లతో దాడి చేయడంతో పాటు 1,100 పైగా బాంబులు విసిరింది.  ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ,  చాలా కాలం క్రితమే యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. ఇది పుతిన్‌ వైఖరిని స్పష్టం చేస్తంది. ఈ యుద్ధాన్ని ముగించాలి. దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం, అలాగే మాకు రక్షణ కూడా అవసరం. అమెరికాతో పాటు యూరప్‌ దేశాలు, మిగతా భాగస్వాముల మాకు అండంగా ఉండండి. ఇప్పటివరకూ మాకు సాయంగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు’ అని జెలెన్‌ స్కీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.  ఇక తాము అమెరికా డిఫెన్స్‌ సిస్టమ్‌ను కూడా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తమ పరిస్థితిని చెప్పుకొచ్చారు జెలెన్‌ స్కీ.

 

 రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)