Breaking News

Davos: బ్యాంకులతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి కీలక చర్చలు

Published on Tue, 01/16/2024 - 19:52

జ్యురిచ్‌: రష్యాతో యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్‌ దేశాన్ని పునర్నిర్మించేందుకు ఆ దేశ అధ్యకక్షుడు జెలెన్‌స్కీ నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు ఆయన స్విట్జర్లాండ్‌ వెళ్లారు.

సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన ప్రపంచ బ్యాంకింగ్‌ దిగ్గజాలు, అగ్రశ్రేణి ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) సంస్థల యాజమాన్యాలను జెలెన్‌స్కీ కలుస్తున్నారు. తమ దేశాన్ని పునర్నిర్మించేందుకు అప్పులివ్వడంతో పాటు పెట్టుబడులు పెట్టాల్సిందిగా జెలెన్‌స్కీ వారిని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇందులో భాగంగా అమెరికా బ్యాంకింగ్‌ దిగ్గజం జేపీ మోర్గాన్‌ చేస్‌ సీఈవో జేమీ డైమన్‌తో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. డైమన్‌తోనే కాక ప్రముఖ పీఈ సంస్థలు బ్లాక్‌రాక్‌, బ్రిడ్జ్‌ వాటర్‌ అసోసియేట్స్‌, కార్లైల్‌ గ్రూపు, బ్లాక్‌స్టోన్‌ సంస్థల యాజమాన్యాలతోనూ జెలెన్‌స్కీ చర్చలు జరుపుతున్నారు.

ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘2023లో ఉక్రెయిన్‌ ఎకానమీ 5 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది మరో 4.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేటు పెట్టుబడి కూడా ఎంతో ముఖ్యం’అని జెలెన్‌ స్కీ తెలిపారు. కాగా, తాజాగా ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌కు తక్షణమే 4.2 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం కావాలని తన భాగస్వామ్య దేశాలను కోరడం గమనార్హం. 

ఇదీచదవండి.. చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)