Breaking News

‘యూనస్‌ ఉగ్రవాదుల ఫ్రంట్‌మన్’.. హసీనా ఆగ్రహం

Published on Thu, 11/13/2025 - 09:43

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా  ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాన సలహాదారు, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్‌పై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఆర్థికవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న ఆయన దానిని  దుర్వినియోగం చేస్తున్నారని హసీనా ఆరోపించారు. సీఎన్‌ఎన్‌- న్యూస్‌ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ యూనస్‌పై అంతర్జాతీయ సమాజానికున్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఆయనను అందరూ ఎన్నికకాని దేశాధినేతగా చూస్తున్నారన్నారు. అతని పరిపాలన రాజ్యాంగాన్ని కూల్చివేస్తున్నదని,  మైనారిటీలను రక్షించడంలో విఫలమవుతున్నదని షేక్ హసీనా ఆరోపించారు.

దేశాన్ని మతోన్మాదంగా మారుస్తూ, సామాజికంగా తిరోగమన దేశీయ ఎజెండాను అనుసరిస్తున్న యూనస్‌ ‘ఉగ్రవాదుల ఫ్రంట్‌మన్‌’గా ఉన్నారంటూ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మంత్రివర్గంలో రాడికల్ తీవ్రవాదులు ఉన్నారని, ఫలితంగా మైనారిటీలు అణచివేతకు గురవుతున్న వాతావరణం ఏర్పడిందని హసీనా పేర్కొన్నారు. యూనస్ ప్రజాస్వామ్య ఆధారాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తొమ్మిదిసార్లు ఎన్నికైన  అవామీ లీగ్‌ను రాబోయే ఎన్నికల నుండి నిషేధించాలనే ఆయన నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.

యూనస్‌ ప్రజాస్వామ్య పాలన మార్పునకు చిహ్నం కాదని, అతనికి ప్రజల్లో విస్తృత మద్దతు లేదని, అతను ఎన్నిక కాని వ్యక్తి అని హసీనా ఆరోపించారు. అందుకే ఆయన లక్షలాది మంది మద్దతు కలిగిన పార్టీని ఎన్నికల నుండి బహిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని హసీనా  ఆరోపించారు. ఇతర దేశాల వారు యూనస్‌ను స్నేహితునిగా భావిస్తే, వారు మోసపోతున్నట్లేనని హసీనా పేర్కొన్నారు. ఆ నోబెల్ గ్రహీత తన గత రచనలతో పొందిన ఇమేజ్‌ను ప్రస్తుతం తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారని హసీనా ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘మహిళా డాక్టర్‌’ను ‘డీకోడ్‌’ చేసిన సన్నిహితులు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు