Breaking News

నువ్వు.. నా మనసు దోచావ్‌.. మదురోకు వైట్‌హౌస్‌ ‘ప్రేమ’ సందేశం

Published on Sat, 02/14/2026 - 18:40

వాలెంటైన్స్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో రాజకీయంగా ప్రభావం కలిగించే డిజిటల్ కార్డుల శ్రేణిని విడుదల చేసింది అగ్రరాజ్యపు వైట్‌హౌస్‌. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోపారి బాధ్యతలు చేపట్టిన తర్వాత  జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనలను ప్రతిబింబించేలా  ఈ కార్డులు ఉండటం గమనార్హం.  ఇలా పలు రకాల వాలెంటైన్స్‌ డే  ప్రేమ సందేశాలను పంపింది వైట్‌హౌస్‌. 

అంటే, ఇవి సాధారణ ప్రేమ కార్డుల మాదిరి కాకుండా, రాజకీయ పరిణామాలను,  రాజకీయ నేతలను పరిహాసం చేసేలా రూపొందించారు. ఇందులో వెనుజువేలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో కోసం ప్రత్యేకంగా ఒక గ్రీటింగ్‌ కార్డును వైట్‌హౌస్‌ రిలీజ్‌ చేసింది. 

ఇందులో  నువ్వు నా మనసు దోచావ్‌( You Captured My Heart) అంటూ మదురోపై సెటైర్లు వేస్తూ గ్రీటింగ్‌ కార్డు రిలీజ్‌ చేసింది. ఇందులో మదురోకు కళ్లకు గంతలు కట్టి,  చేతులను బేడీలతో బందించి ఉన్న ఫోటోను పెట్టి.. ఈ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇలా పలు పరిణామాలను జోడిస్తూ వైట్‌హౌస్‌ ప్రేమ సందేశాలను పంపింది.  

మరో కార్డు ట్రంప్ ఒక “Executive Order 4547” అనే పత్రాన్ని పట్టుకుని, దానిపై “UR My Valentine” అని రాసి ఉన్నట్లు చూపిస్తుంది. మూడవ కార్డుపై డెమోక్రాటిక్ సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ ఎల్ సాల్వడార్‌లో MS-13 గ్యాంగ్ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కిల్మార్ అబ్రెగో గార్సియాతో మార్గరిటాస్ తాగుతున్నట్లు చూపిస్తుంది. నీపై నా ప్రేమ, అక్రమ వలసదారులపై డెమోక్రాట్ల ప్రేమంత బలంగా ఉంది. నీతో ఒక డ్రింక్ తాగడానికి నేను 1,537 మైళ్ళు ప్రయాణిస్తాను’ అని వ్యంగ్యంతో కూడిన వాలెంటైన్స్‌ డే సందేశాలను ఉంచింది వైట్‌హౌస్‌. 

ఈ కార్డులు సాధారణ ప్రేమ సందేశాల కంటే రాజకీయ హాస్యంతో కూడినవిగా ఉండటంతో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది ట్రంప్‌ పైత్యమని పలువురు మండిపడుతున్నారు.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)