Breaking News

200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది? 800 మంది ఖైదీలు ఏం చేశారు?

Published on Thu, 10/05/2023 - 10:46

మనకు తెలిసినవారు ఎవరైనా జైలుకు వెళ్లారనే వార్త వినిపిస్తే, ముందుగా మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రపంచంలో 200 సంవత్సరాల క్రితం నిర్మితమైన జైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ జైలులో దెయ్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ ప్రపంచంలోనే మొదటి జైలుగా పరిగణిస్తారు. ప్రమాదకరమైన ఖైదీల కోసం ఈ జైలును నిర్మించారు. జైళ్ల నిర్మాణానికి ఈ జైలు నమూనాగా నిలిచింది. 

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ జైలు నిర్మితమయ్యింది. 1829లో నిర్మించిన ఈ జైలులో 1971 వరకు కార్యకలాపాలు కొనసాగాయి. మొదట్లో ఈ జైలును 250 మంది ఖైదీల కోసం మాత్రమే నిర్మించారు. ఐదు దశాబ్దాల్లో జైలులోని సంఖ్య 1000కు పైగా పెరిగింది. ఆ తర్వాత జైల్లో ఖైదీల కష్టాలు ఎక్కువయ్యాయి. 1900లలో ఈ జైలులో టీబీ వంటి ప్రాణాంతక వ్యాధి వ్యాపించింది. దీంతో చాలా మంది ఖైదీలు చనిపోయారు. 

చలికాలంలో ఈ జైలులో ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోవడంతో చలికి ఖైదీలు వణికిపోయేవారు. ఖైదీల సంఖ్య పెరిగిన నేపధ్యంలో జైలు అధికారులను మరిన్ని సెల్‌లను నిర్మించవలసి వచ్చింది. వీటిలో కొన్ని భూగర్భంలో నిర్మితమయ్యాయి. జైలులో 1961లో జరిగిన ఒక సంఘటన సంచలనం రేకెత్తించింది. జైలులోని 800 మందికి పైగా ఖైదీలు జైలు గార్డులు తమను హింసించారని ఆరోపిస్తూ వారిపై దాడి చేశారు.

ఈ జైలులో కరుడుగట్టిన నేరస్తులు కూడా ఉండేవారు. వీరిలో చికాగో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్ పేరు కూడా వినిపిస్తుంది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ జైలు 1971లో మూసివేశారు. అయితే 1994లో హిస్టరీ టూరిజం కోసం జైలు  తిరిగి తెరిచారు. ఇప్పుడు ఈ జైలు ఆసక్తికర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. నేటికీ ఈ జైలు నుంచి వింత శబ్దాలు వస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..!

#

Tags : 1

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)