36 ఏళ్లుగా అతనినే తండ్రి అనుకుంది.. తల్లి అసలు రహస్యం చెప్పగానే..

Published on Sun, 07/23/2023 - 11:00

ఒక్కోసారి కుటుంబంలోని ఎవరో ఒకరు ఏళ్ల తరబడి దాచివుంచే రహస్యాలు బయటపడితే ఆ క్షణంలో ఇంటిలోనివారి అనుబంధంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంగ్లండ్‌లోని టిఫనీ గార్డ్‌నర్‌ తన తండ్రి క్యాన్సర్‌తోనే మరణించాడనే భావనతోనే  పెరిగిపెద్దయ్యింది. అతని తల్లి, సవతి తండ్రి ఏలోటూ లేకుండా ఆమెను ఆలనాపాలనా చూస్తున్నారు.

అయితే టిఫనీ చిన్నప్పటి నుంచి తన అసలు తండ్రి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూవస్తోంది. మృతి చెందిన తన తండ్రి ఔరక్ మేక్ నుంచి తనకు ఏ గుణాలు వచ్చాయో తెలుసుకోవాలనుకునేది. తన తండ్రి బతికి ఉంటే అతనితో తన అనుబంధం ఎలా ఉండేదోనని ఆలోచిస్తుండేది. 

మూడు దశాబ్ధాలుగా తన కన్న తండ్రి మరణించాడని భావిస్తూ వచ్చిన ఆమెకు ఒకరోజు అసలు నిజం తెలిసింది. 2018లో టిఫనీకి.. తాను ఒక అజ్ఞాత వ్యక్తి డొనేట్‌ చేసిన స్మర్మ్‌ నుంచి పుట్టినదానినని తెలిసింది. దీంతో తన తండ్రి ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడని ఆమెకు అనిపించింది. 

టిఫనీ ‘ది మిర్రర్‌’తో మాట్లాడుతూ తన తల్లి.. తన పెంపుడు తండ్రి దగ్గర ఒక మాట తీసుకున్నదని, దాని ప్రకారం తన నిజమైన తండ్రి ఎవరో తనకు చెప్పకూడదని తన తల్లిదండ్రులిద్దరూ నిర్ణయించుకున్నారని తెలిపింది. పైగా 1982లో వైద్యులు కూడా ఇన్‌ఫెర్టైల్‌ బాధితులకు తాము ఎవరి నుంచి స్మెర్మ్‌  తీసుకున్నామనేది గోప్యంగా ఉంచేవారు.  

తన జీవితం ఒక్కసారిగా మారిపోయిన రోజును టిఫనీ ఎప్పటికీ మరచిపోలేదు. టిఫనీకి తన 36వ జన్మదినాన ఈ విషయం తెలిసింది. ఇంటిలోని వంటగదిలో తల్లి స్వయంగా ఈ విషయాన్ని టిఫనీకి తెలిపింది. తల్లి మాటలు వినగానే టిఫనీకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లయ్యింది. అయితే ఆలోచించుకుంటే.. తన మంచి కోసమే తల్లి ఇన్నాళ్లూ ఈ సంగతిని దాచివుంచిందని ఆమెకు అనిపించింది. తనకు తల్లీదండ్రులతో సహజమైన అనుబంధం కొననాగాలనే ఉద్దేశంతోనే ఈ విషయం ఇన్నాళ్లూ చెప్పలేదని టిఫనీకి తల్లి చెప్పింది. 
ఇది కూడా చదవండి: పామును పట్టి, బస్తాలో బంధించి.. ఆసుపత్రిలో యువకుని హల్‌చల్‌!

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)