Breaking News

ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ

Published on Mon, 06/09/2025 - 13:35

కొలరాడో: మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. జననం ఆవలి మరణంలో ఏముందో తెలుసుకోవాలని మనిషి  కొన్ని వేల ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పలు ఊహాగానాలు పుట్టుకువస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు ఉండటం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ ‘స్ఫృహ’కు ఆవతలివైపు ఏముందో చూశానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది.  అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు  కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను  చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను. ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను.  అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు.  అయినప్పటికీ  అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.

నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం కష్టం అని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మానవ మెదడు  మరణం అంచుకు చేరినప్పడు, జీవితంలో ముఖ్య ఘట్టాలను గుర్తుచేసుకుంటుంది. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో జీవులన్నీ జీవితాంతం తమ చుట్టూ ఒక కాంతిని వెదజల్లుతాయని, అయితే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని వెల్లడయ్యింది. 

ఇది కూడా చదవండి: రాజ్‌తో సంబంధం.. రాజాతో పెళ్లి?.. ‘హనీమూన్‌ జంట’కథలో అసలు నిజం 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)