Breaking News

దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌ కూతురిని చంపిన యువతి

Published on Sun, 01/14/2024 - 16:18

అమెరికాలోని పెన్సిల్వేనియాలో అలెసియా ఓవెన్స్ అనే యువతి మానవత్వాన్ని మరిచి తన బాయ్‌ఫ్రెండ్‌కు చెందిన 18నెలల చిన్నారిని పొట్టనబెట్టుకుంది. గతేడాది జూన్‌లోని జరిగిన ఈ ఘటనలో అలెసియాను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటార్నీ జనరల్‌ మిచెల్ హెన్రీ తెలిపిన వివరాల ప్రకారం.. 18 నెలల ఐరిస్ రీటా అల్ఫెరా మృతికి కారణం అలెసియా అని.. పాపకు జరిపిన శవపరీక్షలో నమ్మలేని నిజాలు భయటపడ్డాయని తెలిపారు. అసిటోన్ అనే రసాయనం, వ్యాచ్‌ బ్యాటరీలు, స్క్రూలను పాపకు తినిపించడం వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు.

20 ఏళ్ల అలెసియా ఓవెన్స్.. జూన్‌25, 2023న పాప ఐరిస్ రీటా అల్ఫెరా తండ్రి బెయిలీ జాకబ్  పక్కనే ఉన్న ఒక స్టోర్‌ వెళ్లాడు. అదే సమయంలో పాపలో ఇంట్లో ఉన్న అలెసియా ఐరిస్‌ రీటాలో ఉలుకుపలుకు లేదని గమనించారు. అయితే ఈ సమాచారాన్ని ఆమె బెయిలీ జాకబ్‌కు అందించింది. దీంతో బెయిలీ జాకబ్‌ పాపను పిట్స్బర్గ్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం పాప ఐరిస్‌ రీటా మృతి చెందింది. పాప అవయవాల వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పాప ఐరిస్‌ తన తల్లి ఎమిలి అల్ఫెరాతో ఉంటోంది. అయితే తండ్రి బెయిలీ జాకబ్‌కు కేవలం సందర్శన హక్కులు మాత్రమే ఉండటం గమనార్హం‌.

పాప మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు అలెసియా ఫోన్‌ పరిశీలించగా.. పలు నమ్మలేని నిజాలు భయటపడ్డాయి. పాప ఐరిస్‌ మృతికి ముందు.. అలెసియా పిల్లలకు హానీ చేసే వస్తువులు, పద్దతులకు సంబంధించి ఫోన్‌లో సమాచారాన్ని వెతికినట్లు బయటపడింది. పిల్లలకు హాని కలిగించే  అసిటోన్‌ రసాయనం, బ్యాటరీలు, నెయిల్‌ పాలీష్‌, చిన్న వాటర్‌ బాల్స్‌, చిన్నపిల్లలకు విషపూరితంగా మారే బ్యూటీ ప్రాడక్టులను కూడా వెతికినట్లు పోలీసులు గుర్తించారు. శవ పరీక్షల నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా తేలటంతో అలెసియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ఎందుకు చిన్నారిని చంపిందనే విషయంపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.

చదవండి: గాల్లో ఉండగానే కాక్‌పిట్‌ అద్దంలో పగుళ్లు!

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)