Breaking News

30 దేశాల పౌరులపై నిషేధానికి అమెరికా సన్నాహాలు

Published on Fri, 12/05/2025 - 21:26

అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. 

అమెరికా తమ పౌరుల భద్రత పేరుతో పలు దేశాలను, ఆ దేశాలకు చెందిన పౌరులను నిషేధించాలని నిర్ణయించింది. తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రోగ్రామ్ ‘ది ఇంగ్రహం యాంగిల్’లో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా 19 దేశాలకు చెందిన పౌరులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. అంటే.. ఈ దేశాలకు చెందిన పౌరులకు అన్నిరకాల ఇమ్మిగ్రేషన్లను నిలిపివేయనుంది. అదేవిధంగా పౌరసత్వం, గ్రీన్‌కార్డు దరఖాస్తులకు సైతం ఆయా దేశాల పౌరులను అనర్హులుగా ప్రకటించింది. అదేవిధంగా ఆయా దేశాలకు తమ పౌరులు వెళ్లకూడదంటూ ట్రంప్ ట్రావెల్ అలెర్ట్ జారీ చేశారు.

 ఇప్పటికే నిషేధం అమలవుతున్న దేశాలు ఏవి? 
గత నెల వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్‌పై ఆఫ్ఘన్ శరణార్థి కాల్పులు జరిపిన ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు.. కాంగో, క్యూబా, ఇరాన్, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, తుర్కెమెనిస్థాన్, వెనిజులా, యెమన్‌తోపాటు.. మొత్తం 19 దేశాలపై నిషేధం విధించారు. తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం ఈ జాబితాలో మరో 11 దేశాలు చేరనున్నట్లు స్పష్టమవుతోంది.

 ట్రంప్ నిర్ణయాన్ని రివర్స్ మైగ్రేషన్ అనవచ్చా?
అవును ఇది కచ్చితంగా రివర్స్ మైగ్రేషనే. ట్రంప్ నిషేధం విధించిన దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి డీపోర్ట్ చేస్తారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడినప్పుడు.. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, తమ దేశంలో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం భారీ కసరత్తే చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయంలో సమస్యాత్మక జనాబా తగ్గుతుందని, అంతకు మించితే సామాజిక సమస్యలు ఏమీ ఉండవని అభిప్రాయపడ్డారు. మరో 11 లేదా అంతకంటే ఎక్కువ దేశాలపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ జాబితాలో ఏయే దేశాలున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)