Breaking News

బ్యారికేడ్లపైకి దూసుకొచ్చి ఢీకొట్టిన వ్యాన్ : వైట్‌హౌస్‌ వద్ద కలకలం

Published on Wed, 03/11/2026 - 19:32

వాషింగ్టన్‌: ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం సంక్షోభం కొనసాగుతుండగానే బుధవారం (మార్చి 11, 2026) తెల్లవారుజామున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద తీవ్ర కలకలం రేగింది. వైట్ హౌస్ సమీపంలో భద్రతా బారికేడ్లను దాటి ఒక వ్యాన్ దూసుకు వచ్చింది. పర్యాటకులు, ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని భద్రతా గేటును వ్యాన్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా  ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని ప్రాంతాన్ని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు.

వైట్ హౌస్‌కు ఉత్తరాన ఉన్న లఫాయెట్ స్క్వేర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని అధ్యక్ష భద్రతను నిర్వహించే సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపారు. వాహన వివరాలను పరిశీలిస్తున్నామని సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు  చెప్పారు. 

ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్‌ క్రూ రీల్‌, ఎయిరిండియా విచారణ

వైట్ హౌస్ చుట్టూ ఉన్న అనేక ప్రధాన వీధులను పోలీసులు మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, నగర కార్మికులు తమ కార్యాలయాలకు రాకుండా చేశారు. ట్రాఫిక్ రద్దీ ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. పర్యాటకులు, నివాసితులు వీధులు తిరిగి తెరవడానికి వేచి ఉన్నారు. 

ఇదీ చదవండి: అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్‌ పైలట్ ఆవేదన వైరల్‌


 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)