Breaking News

హమాస్‌కు ఆయుధాలు ఎక్కడివి? కీలకపాత్రధారులెవరు?

Published on Tue, 10/17/2023 - 11:48

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి ఏళ్ల చరిత్ర ఉంది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్‌ను ప్రపంచంలోని అనేక దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అలాగే మానవతా ధృక్ఫథంతో పాలస్తీనాకు సహాయం అందిస్తున్న యూరప్‌లోని పలు దేశాలు ఇకపై తమ సహాయాన్ని కొనసాగించాలా వద్దా అనే డైలమాలో పడ్డాయి. అటువంటి పరిస్థితిలో హమాస్‌కు ఆర్థిక సహాయంతో పాటు ఆయుధాలు ఎక్కడ నుండి లభిస్తున్నయనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంది.

హమాస్‌కు మద్దతు అందించేందుకు ఇరాన్, సిరియాల నుంచి పలు రహస్య మార్గాలు ఉన్నాయి. 2005లో గాజా నుండి ఇజ్రాయెల్ వైదొలిగిన తర్వాత, సిరియా, ఇరాన్‌లను అనుసంధానిస్తూ మార్గాన్ని ఏర్పరుచుకునేందుకు హమాస్‌కు అవకాశం లభించింది. 2007లో ఇజ్రాయెల్ సూడాన్ ద్వారా హమాస్‌కు అందుతున్న ఆయుధ రవాణాను అడ్డుకుంది. అయితే దీని ప్రభావం అంతగా కనిపించలేదు.

కార్పొరేషన్ ఫర్ వరల్డ్ వైడ్ బ్రాడ్‌కాస్టింగ్ తెలిపిన వివరాల ప్రకారం సుడాన్‌కు వెళ్లే మార్గంలో ఫజర్-5 రాకెట్‌లను మోసుకెళ్తున్న ఓడను అడ్డుకోవడం బ్లాక్ మార్కెట్ ఉనికిని తెలియజేస్తుంది. హమాస్ వివిధ ఆయుధాలను సముద్ర మార్గం ద్వారా అందుకుంటుంది. ఇజ్రాయెల్ నావికాదళం కన్నుగప్పి ఇవన్నీ కొనసాగుతున్నాయంటారు. అలాగే హమాస్.. ఇరాన్, సిరియా మీదుగా ఈజిప్ట్-గాజా సరిహద్దులో ఒక రహస్య సొరంగాన్ని నిర్మించింది. దీని ద్వారా ఆయుధ రవాణా జరుగుతుందని సమాచారం. 

హమాస్ ఇరాన్, సిరియాలతో సన్నిహితంగా ఉంటూనే ఫజ్ర్-3, ఫజ్ర్-5, ఎమ్302 తదితర రాకెట్లను విదేశాల నుండి కొనుగోలు చేసింది. 2014 గాజా యుద్ధంలో హమాస్ ఇజ్రాయెల్‌పై 4500 రాకెట్లను ప్రయోగించింది. హమాస్‌కు ఆయుధాలు అందించడంలో స్మగ్లర్లు, ఓడల సిండికేట్‌లు, ఫైనాన్స్ ఆపరేటర్లు మొదలైనవారు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 
ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం?

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)