ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. డీఎస్టీ రద్దు

Published on Sat, 12/14/2024 - 13:17

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వరుసగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టకముందే.. తాను ఏం చేయబోతున్నాననే విషయాలను వరుసగా ప్రకటిస్తున్నారాయన. ఈ క్రమంలో వంద ఏళ్లుగా అమెరికన్లు పాటిస్తున్న డేలైట్‌ సేవింగ్‌ టైం(DST) విధానానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

‘రిపబ్లికన్‌ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేయనుంది. ఈ పద్ధతిని అనుసరించడం ఎంతో అసౌకర్యంగా ఉంది. దీనివల్ల అమెరికన్లపై చాలా భారం పడుతుంది’ అని రాసుకొచ్చారు. డేలైట్‌ సేవింగ్‌ టైం అంటే.. వసంతకాలంలో ఒక గంట ముందుకు, శరధ్రుతువులో ఒక గంట వెనక్కి గడియారంలో సమయాలను మార్చుకోవడం. అయితే,  ఈ పద్ధతికి కాలం చెల్లిందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నది చాలామంది అభిప్రాయం.

ఎనర్జీ సేవింగ్‌.. అంటే పగటికాంతిని సాయంత్ర వేళల్లో సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఈ విధానం పాటిస్తున్నారు. అయితే  ఈ విధానం వల్ల పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా నిద్రపై ప్రభావం పడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

1784లో బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ తొలిసారిగా డేలైట్‌ సేవింగ్‌ టైం ప్రతిపాదన చేశారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తొలిసారి ఈ డే లైట్ సేవింగ్‌ టైమ్‌ను  అమెరికన్లు పాటించారు. యుద్ధం ముగిశాక.. ఈ విధానం పాటించడం మానేశారు. అయితే తిరిగి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధానం మళ్లీ అమెరికాలో ఆచరణలోకి వచ్చింది. యూనిఫామ్‌ టైం యాక్ట్‌ 1966 కింద.. ఈ విధానం శాశ్వతంగా మారిపోయింది.  అయితే హవాయ్‌,ఆరిజోనా మాత్రం ఈ విధానం పాటించడం లేదు. 

అయితే ఈ విధానాన్ని మూర్ఖపు విధానంగా పేర్కొంటూ.. సెనేటర్‌ మార్కో రుబియో 2022లో సన్‌షైన్‌ ప్రొటెక్షన్‌ అనే బిల్లును తెచ్చారు. బిల్లు సెనేట్‌లో పాసైనప్పటికీ.. హౌజ్‌లో మాత్రం ఆమోదం దక్కించుకోలేకపోయింది. దీంతో.. బైడెన్‌ దాకా ఆ బిల్లు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ట్రంప్‌ కార్యవర్గంలో రుబియో స్టేట్ సెక్రటరీగా ఉండడం గమనార్హం.

ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామిలాంటి ట్రంప్‌ అనుచరగణం  కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. మరోవైపు.. డీఎస్‌టీ ద్వారా ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికన్లు ప్రతీ ఏటా మార్చి-నవంబర్‌ మధ్య డేలైట్‌ టైం ను.. నవంబర్‌-మార్చి మధ్య స్టాండర్డ్‌ టైంను ఫాలో అవుతున్నారు. ట్రంప్‌ నిర్ణయం అమల్లోకి వస్తే.. కాలాన్ని మార్చుకునే ఈ వందేళ్ల ఆనవాయితీకి పుల్‌స్టాప్‌ పడుతుంది. అమెరికా మాత్రమే కాదు.. యూరప్‌ సహా ప్రపంచంలోని మూడింట దేశాలు ఈ పద్ధతిని అవలంభిస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)