Breaking News

హాంకాంగ్ ప్రమాదానికి కారణం ఏంటంటే..

Published on Thu, 11/27/2025 - 17:29

హాంకాంగ్ వాంగ్ హాక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 65కు చేరుకుంది. 70 మంది తీవ్రగాయాలపాలవగా , 237 మంది ఆచూకీ లభించడంలేదు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంత తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

 బుధవారం  హాంకాంగ్ లోని వాంగ్ పుక్ కోర్ట్  టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 65 మంది దుర్మరణం చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాద ఘటనపై ఆదేశ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఇంత పెద్దఎత్తున మంటలు చెలరేగడానికి ఆ భవన మరమ్మత్తులో ఉపయోగిస్తున్న సామాగ్రి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

భవన నిర్మాణం ప్రతి కిటికీలలో స్టైరోఫామ్ తో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించారని దాని కారణంగానే మంటలు ఇంత పెద్దఎత్తున వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టైరోఫామ్ అనేది పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్. దీనిని నిర్మాణరంగంలో, ఫుడ్ ప్యాకేజింగ్ లలో అధికంగా ఉపయోగిస్తారు. అయితే స్టైరోఫామ్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. దీనికి మంటలు అంటుకుంటే అంత తేలికగా ఆర్పలేము. 

ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రదేశాలలో కూడా ఇది అధికంగా మండుతుంది. అంతేకాకుండా ఇది మండుతున్నప్పుడు అధిక మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ విడుదల చేస్తుంది.  ఈ నేపథ్యంలో భవన మరమ్మత్తులో ఇంత హానీకర వస్తువులను ఎందుకు ఉపయోగించారు అని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

కాగా హాంకాంగ్ లోని అసోసియేయేట్ ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం మరమ్మత్తులు చేపడుతున్న ఇంజినీరింగ్ కంపెనీ ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటించలేదని  నివేదించింది. హాంకాంగ్ లో నిన్న ప్రమాదం జరిగిన భవంతి 1980లో నిర్మించారు. ఆ టవర్స్ లో 2వేలకు పైగా అపార్ట్ మెంట్స్ ఉండగా 4వేలకు మందికి పైగా నివసిస్తున్నారు. ఇటీవల ఆ భవనాలకు మరమ్మత్తులు చేస్తుండగా ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు