Breaking News

భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువయ్యాం: ట్రంప్‌

Published on Tue, 07/08/2025 - 07:54

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి మరింత చేరువయ్యామని వ్యాఖ్యానించారాయన. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తదనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ట్రంప్‌ భారత వాణిజ్య ఒప్పందంపై వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది’’ అని అన్నారు. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్న ఆయన.. ఇతర దేశాలు అమెరికా షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. వారు(ఒప్పందాలకు దిగిరాని వారు) ఎంత టారిఫ్ చెల్లించాలో లేఖలో చెబుతున్నాం అని ట్రంప్‌ చెప్పారు. 

భారత్‌కు కలిగే లాభాలు:

  • మార్కెట్ ప్రాప్యత: అమెరికా మార్కెట్‌కు భారత ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు పెరగొచ్చు.
  • తక్కువ దిగుమతి సుంకాలు: భారత్‌కు వస్తువులు దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గవచ్చు.
  • టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్: మౌలిక సదుపాయాలు, హైటెక్ రంగాల్లో భాగస్వామ్యం మెరుగుకావొచ్చు.
  • భద్రతా సహకారం: వ్యూహాత్మక మైత్రి బలపడే అవకాశం ఉంటుంది.

మరోవైపు.. భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదరకపోతే, తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ఒప్పందం కుదిరితే మాత్రం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు.

 ఏ దేశాలపై.. ట్రంప్‌ ఎంతెంత టారిఫ్‌ (ఆగస్టు 1 నుంచి అమలు):

  • దేశంటారిఫ్ శాతం
    జపాన్, దక్షిణ కొరియా, కజకస్తాన్, మలేషియా, ట్యునీషియా25%
    మయన్మార్, లావోస్40%
    దక్షిణాఫ్రికా, బోస్నియా30%
    ఇండోనేషియా32%
    బంగ్లాదేశ్, సెర్బియా35%
    కంబోడియా, థాయిలాండ్36%

     

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)