Breaking News

డీల్‌ ఓకే.. ట్రంప్‌తో మరోసారి భేటీకి సిద్ధమే: జెలెన్‌స్కీ

Published on Mon, 03/03/2025 - 08:46

కీవ్‌: ఉక్రెయిన్‌కు యూరోపియన్‌ యూనియన్‌ నేతల నుంచి మద్దతు వస్తున్న వేళ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన ప్రకటనపై ట్రంప్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘అమెరికాతో మేము సత్సంబంధాలను కాపాడుకోగలం. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి భేటీ అయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నిర్మాణాత్మక సంభాషణ కోసం ఆహ్వానిస్తే తప్పకుండా ట్రంప్‌ను కలుస్తాను. అలాగే, ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేస్తాను. 

ఇది భద్రతా హామీల వైపు మొదటి అడుగు అవుతుంది. భద్రతా హామీలు లేని కాల్పుల విరమణ ఉక్రెయిన్‌కు ప్రమాదకరం. మేము గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాము. అమెరికా మా వైపు ఉందని ఉక్రేనియన్ ప్రజలు తెలుసుకోవాలి. మాకు కావాల్సింది శాంతి. అంతులేని యుద్ధం కాదు. అందుకే భద్రతా హామీలు దీనికి కీలకమని మేము చెబుతున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్‌ వేదికగా జరిగిన చర్యల వాగ్వాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అమెరికా, ఉక్రెయిన్‌ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. జెలెన్‌‍స్కీపై ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌ కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉండాలన్నారు. ఇకపై ఉక్రెయిన్‌కు సాయం చేసేది లేదని కుండబద్దలు కొట్టారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)