Breaking News

భారత్‌పై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 09/08/2025 - 12:56

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్‌ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు అయ్యింది.

భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీపై అడిగిన ప్రశ్నకు జెలెన్‌స్కీ సమాధానం ఇస్తూ.. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌లు విధించడం సరైన చర్యే. రష్యాను కట్టడి చేయాలంటే సుంకాలు అవసరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అలస్కాలో ట్రంప్‌-పుతిన్‌ భేటీకి ఉక్రెయిన్‌కు ఆహ్వానించకపోవడం విచారకరమని కామెంట్స్‌ చేశారు. అయితే, మాస్కో-కీవ్‌ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్‌ దౌత్య యత్నాలు చేస్తున్నా ఆయన నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.

కాగా.. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని భారత్‌ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్‌, ఇటు జెలెన్‌స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్‌తో భేటీకి ముందు ఉక్రెయిన్‌ అధినేతతో మాట్లాడారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్‌ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన  సహకారాన్ని అందించేందుకు, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి సమయంలో నుంచి భారత్‌పై ప్రతికూల ప్రకటన వెలువడటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చర్యలపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలస్కాలో ట్రంప్-పుతిన్‌ చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌ రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలయ్యేలా చూసే బాధ్యత తమదే అంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. 
 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)