ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్‌ పిలుపు

Published on Mon, 12/29/2025 - 03:59

వాష్టింగన్‌: కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపాలని, అందుకు సమయం వృదా చేయాల్సిన అవసరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో జరిగిన భేటీలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ట్రంప్ తన శైలిలో యుద్ధాన్ని త్వరగా ముగించగలమని నమ్మకం వ్యక్తం చేయగా.. జెలెన్‌ స్కీ అమెరికా మద్దతు ఉక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

ఈ చర్చల్లో సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జెలెన్‌ స్కీ ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, అమెరికా సహాయం కొనసాగాలని కోరారు. ట్రంప్, తన పదవీకాలంలో ప్రత్యేక శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.

యూరోపియన్ నాయకులు, ట్రంప్- జెలెన్‌స్కీల మధ్య చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కొత్త మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. అయితే, విశ్లేషకులు ట్రంప్ ప్రతిపాదించే శాంతి ప్రణాళికలో రష్యా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలక మలుపు కావచ్చు. ట్రంప్ త్వరిత పరిష్కారం వాగ్దానం చేస్తున్నప్పటికీ జెలెన్‌ స్కీ మాత్రం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భూభాగ సమగ్రతపై రాజీ పడరాదని స్పష్టం చేస్తున్నారు. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)