Breaking News

ఉక్రెయిన్‌ మొత్తం మాదే.. పుతిన్‌ సంచలన ప్రకటన

Published on Sat, 06/21/2025 - 11:44

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్‌ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్‌ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.

ర‍ష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్‌ మొత్తం మాదే. ఉక్రెయిన్‌ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్‌లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్‌ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఖండించిన పుతిన్
అయితే, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.

ఈ సందర్భంగా పుతిన్‌..‘జెలెన్‌ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్‌ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్‌కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)