Breaking News

భారత్‌కు రాలేనన్న పుతిన్‌.. అరెస్ట్‌ భయమే కారణమా?

Published on Mon, 08/28/2023 - 21:07

వచ్చే నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు భారత్‌ సిద్ధమవుతోంది. ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు. మరోవైపు.. జీ-20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరు కావడం లేదు. ఈ మేరకు పుతిన్‌.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. పుతిన్‌ బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ హాజరు కానున్నట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. భారత్‌లో జీ-20 సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసినట్లు పీఎంవో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని పుతిన్.. మోదీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొంటారని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా నిర్ణయంపై, భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ-20 సమ్మిట్‌ కార్యక్రమాలకు రష్యా మద్దతు ఇచ్చినందుకు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పరస్పరం మాట్లాడిన నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యల గురించి కూడా మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇరువురు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో దాడుల కారణంగా పుతిన్‌ అరెస్ట్‌కు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారెంట్‌ జారీ చేసిన నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్ట్‌ అ‍య్యే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగానే పుతిన్‌ ఇతర దేశాల్లో సమావేశాలకు హాజరుకావడంలేదని తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)