ట్రంప్‌ రాజీ ప్రతిపాదనలపై శాంతి ఒప్పందానికి సిద్ధం 

Published on Sat, 06/06/2026 - 05:20

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: ఉక్రెయిన్‌పై నాలుగేళ్లుగా సాగిస్తున్న దురాక్రమణకు ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సిద్ధమయ్యారు. అయితే, యుద్ధ విరమణకు ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనల్లోని కొన్ని రాజీలకు ఉక్రెయిన్‌ అంగీకరించాల్సి ఉంటుందన్నారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముఖాముఖి చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం బహిరంగ లేఖ రాశారు. 

‘చర్చలకు ముందుగా పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఉక్రెయిన్, రష్యా మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే శాంతి సాధ్యం. మనిద్దరి మధ్య ముఖాముఖి చర్చలు జరగాలని ప్రతిపాదిస్తున్నా’అని జెలెన్‌స్కీ అందులో పేర్కొన్నారు. ఈ లేఖ అందిందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ గురువారం రాత్రి పీటీఐ తదితర ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడారు.

 ‘శాంతి నెలకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే, గతేడాది ఆగస్ట్‌లో అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్‌ కొన్ని రాజీలను ప్రతిపాదించారు. అందుకు రష్యా ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌ కూడా ఆయన చేసిన రాజీ ప్రతిపాదనలకు అంగీకరించాల్సి ఉంటుంది. అది జరిగిన పక్షంలో ఈ సంక్షోభం త్వరగా సమసిపోతుంది’అని ఆయన పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌ అంగీకరించాల్సిన రాజీ ప్రతిపాదనలు ఏమిటనే విషయం మాత్రం పుతిన్‌ వివరించలేదు. ఉక్రెయిన్, రష్యాల మధ్య సంక్షోభంలో యూరప్‌ దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఎన్నో ఏళ్లుగా రష్యాను అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్న ఆ దేశాలు ఈ సంక్షోభ పరిష్కారంలో చిత్తశుద్ధి వ్యవహరిస్తాయనే నమ్మకం తమకు లేదని తెలిపారు. 

ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్‌ ప్రాంతాన్ని పూర్తిగా, డొనెట్‌స్‌్కను 85 శాతం, జపొరిజియాను 80 శాతం ఇప్పటికే నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ రాజీకి వచ్చి, యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ఇటీవల ఉక్రెయిన్‌ బలగాలను వెనక్కి తరిమికొట్టి 2,440 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమ బలగాలు ఆక్రమించుకున్నాయని ఆయన వివరించారు. యుద్ధక్షేత్రంలో ప్రతి చోటా తమ సైన్యం ముందుకు సాగుతోందన్నారు. అదేవిధంగా, ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులను నిలువరించేందుకు గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నట్లు ఆయన వివరించారు.  

ముఖాముఖి చర్చలకు పుతిన్‌ నో 
ముఖాముఖి చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇచ్చిన ఆఫర్‌ను పుతిన్‌ తిరస్కరించారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ ఫోరంలో మాట్లాడుతూ..చర్చల కోసం జెలెన్‌స్కీ బహిరంగంగా లేఖ రాయడాన్ని అమర్యాదకరమైన చర్యగా పుతిన్‌ అభివరి్ణంచారు. ‘ఇదసలు వ్యక్తిగత సమావేశాలు, చర్చలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించే మార్గమా? లేక అసలు ఎలాంటి ముఖాముఖి చర్చలు సాధ్యం కాకుండా చేసే వాతావరణాన్ని సృష్టించడమా? నాకైతే జరగాల్సిన సమావేశాలను సైతం జరక్కుండా చేయడమే దీని వెనుక అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది’అంటూ పుతిన్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి సమావేశంతో కలిగే ప్రయోజనం కూడా ఏమీ ఉండదన్నది తన నమ్మకమన్నారు.  
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)