Breaking News

పుతిన్‌ ఫొటో వైరల్‌!

Published on Tue, 05/10/2022 - 18:57

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(69) ఆరోగ్యం గురించి పాశ్చాత్య మీడియా చేస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. పార్కిన్‌సన్‌ లేదంటే క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారంటూ వరుస కథనాలతో ఊదర గొడుతోంది. ఈ  క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించి.. ఆపరేషన్‌ అవసరమని, తద్వారా ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో అధికారం మరొకరికి అప్పగిస్తారంటూ వార్తలు ప్రచురించాయి.

అయితే వీటిలో దేనికి క్రెమ్లిన్‌ వర్గాలు స్పందించలేదు. ఈ తరుణంలో రష్యా టెలిగ్రామ్‌ చానెల్‌ జనరల్‌ ఎస్వీఆర్‌ సైతం ఈ వార్తల్ని ప్రచురించడంతో.. ఆ కథనాలు నిజమనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా యూకేకు చెందిన ఇండిపెండెంట్‌ మరో కథనం ప్రచురించింది. విక్టరీ డే సందర్భంగా.. మాస్కో రెడ్‌ స్క్వేర్‌ వద్ద నిర్వహిస్తున్న మిలిటరీ పరేడ్‌లో పుతిన్‌ దిగిన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. ఆయన అనారోగ్యంపై మరిన్ని సందేహాలు రేకెత్తించేలా.. మందంగా ఉన్న దుప్పటితో కాళ్లను కప్పుకుని దర్శనమిచ్చారు. అంతేకాదు, పుతిన్ దగ్గుతూ కనిపించాడని, అక్కడున్న వారందరిలో చలి నుంచి కాపాడుకోవడానికి అదనపు దుస్తులు ధరించింది పుతిన్ ఒక్కడేనని ఇండిపెండెంట్‌ పేర్కొంది.

తొమ్మిది డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌.. అందులో తనకంటే వయసు పైబడిన వాళ్లు ఉన్నా కూడా పుతిన్‌ ఒక్కడే అలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఇటీవల ఓ సమావేశంలో టేబుల్ ను గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. సమావేశం జరిగినంత సేపు పుతిన్ టేబుల్ ను పట్టుకుని.. వణికిపోతుండడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు బలపడుతున్నాయి.

Videos

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు

రైతులపై సోలార్ పిడుగు

కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

కేరళ లో 273.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కాకాణిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర

అడ్డంగా దొరికిపోయిన విజయసాయి రెడ్డి.. వీడియో వైరల్

ఆగని కక్ష సాధింపులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Photos

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)