Breaking News

మస్క్‌తో విభేదాలు..? వివేక్‌ రామస్వామి క్లారిటీ

Published on Tue, 01/28/2025 - 12:30

వాషింగ్టన్‌:టెస్లా అధినేత ఇలాన్‌ మస్క్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి క్లారిటీ ఇచ్చారు. ట్రంప్‌ ప్రమాణస్వీకారం రోజే  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డీఓజీఈ) బాధ్యతల నుంచి తప్పుకోవడంపై రామస్వామి ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో తాజాగా స్పందించారు. 

మస్క్‌కు సాంకేతికతను ఎక్కువగా నమ్ముతాడని తాను రాజ్యాంగం మీద ఆధారపడి నడిచే శాసనవ్యవస్థను ఎక్కువగా నమ్ముతానని చెప్పారు. ఇంతేతప్ప ఇద్దరి మధ్య విభేదాలు ఏమీ లేవన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకే డీఓజీఈ బాధ్యత నుంచి తప్పుకున్నారా అన్న ప్రశ్నకు లేదని వివేక్‌ సమాధానమిచ్చారు. 

అయితే 2026లో జరగనున్న ఒహియో గవర్నర్‌ ఎన్నికల్లో వివేక్‌ రామస్వామి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని వివేక్‌ చెప్పారు. డీఓజీఈ బాధ్యతలను రామస్వామి,మస్క్‌లకు సంయుక్తంగా ట్రంప్‌ ఇటీవలే అప్పగించిన విషయం తెలిసిందే. 

అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలను రామస్వామి ప్రశంసించారు.కాగా, వివేక్‌ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవడం కోసం రిపబ్లికన్‌ ప్రైమరీల్లో ట్రంప్‌తో తలపడ్డ విషయం తెలిసిందే.ఆ తర్వాత రామస్వామి ప్రైమరీల నుంచి తప్పుకుని ట్రంప్‌ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చారు.   

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)