Breaking News

పార్లమెంట్‌కు అనుకోని అతిథి; పరుగులు పెట్టిన ఎంపీలు 

Published on Thu, 07/22/2021 - 12:45

మాడ్రిడ్‌: స్పెయిన్‌ దేశంలోని అండలూసియా పార్లమెంట్‌లో ఒక ఎలుక హల్‌చల్‌ చేసింది. సమావేశాల్లో భాగంగా కీలక ఓటింగ్‌ నిర్వహిస్తున్న దశలో ఎవరు ఊహించని విధంగా టేబుల్‌పైకి చేరిన ఎలుక.. అక్కడి ఎంపీలను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్‌ సంస్థ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

విషయంలోకి వెళితే.. కొన్ని రోజులుగా పెండింగ్‌లో పడిపోయిన ఒక ముఖ్యమైన తీర్మానంపై బుధవారం ఎంపీలు ఓటింగ్‌ ప్రక్రియను చేపట్టారు. ఓటింగ్‌కు సంబంధించి స్పీక‌ర్ మార్తా బోస్కెట్ సీరియ‌స్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక ఎలుక ఎంపీలు కూర్చున్న టేబుల్‌పైకి ఎక్కింది. దానిని చూసిన స్పీకర్‌ షాక్ తిన్నారు. ఏమైందో అని మిగ‌తా స‌భ్యులు కూడా అటు ఇటూ చూశారు. ఇంతలో ఎలుక పరిగెత్తడం చూసి కొంతమంది ఎంపీలు ఉరుకులు పరుగులు పెట్టగా.. మరికొందరు టేబుళ్లపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా తంటాలు పడి ఎలుక‌ను బ‌య‌ట‌కు పంపించి ఓటింగ్‌ ప్రక్రియను తిరిగి నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)