Breaking News

నడిరోడ్డుపై కామాంధుడి వికృత చేష్టలు

Published on Tue, 07/19/2022 - 08:03

వైరల్‌: ఇంటా.. బయటా.. ఎక్కడ కూడా మనిషికి రక్షణ లేకుండా పోతోంది. అందునా ప్రత్యేకించి మహిళలు పట్టపగలు.. అంతా చూస్తుండగానే వేధింపులకు, దాడులకు గురవుతున్నారు. కఠిన చట్టాలు, త్వరగతిన చర్యలు తీసుకోనంత వరకు పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా.. 

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్‌ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. వెనుక నుంచి వెళ్లి ఆమె పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విడిపించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వేధించిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు దుండగుడు. 

పాక్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ హమీద్‌ మీర్‌ ట్విటర్‌ ద్వారా ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. నిందితుడి కఠినంగా శిక్షించి.. ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెను దుండగుడు ఫాలో అవుతున్నట్లు అంతకు ముందు గల్లీలో ఉన్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినా సోషల్‌ మీడియా విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు.

పాక్‌లో గత కొంతకాలంగా మహిళలపై దాష్టికాలు చోటుచేసుకున్నాయి. ఈ మధ్యే ఓ మెట్రో స్టేషన్‌ బయటకు యువతిని కొందరు కిరాతకంగా వేధించి.. దాడికి పాల్పడిన ఘటన వైరల్‌ అయ్యింది. కిందటి ఏడాది స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఓ టిక్‌టాకర్‌ను చుట్టుముట్టి వందల మంది ఆమెను లైంగికంగా వేధించారు. ఆమె దుస్తులు చించి వికృత చేష్టలకు పాల్పడుతూ దాడి చేశారు. ఆటోలో వెళ్తున్న ఓ యువతిపైనా అంతా చూస్తుండగానే కొందరు వేధించిన వీడియో సైతం వైరల్‌ అయ్యింది. మరోవైపు పాక్‌లో పని చేసే చోట 70 శాతం మంది వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెప్తున్నాయి.

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)