Breaking News

నవ్వులు పంచిన చింటుగాడు ఇక లేడు!

Published on Sun, 08/20/2023 - 10:16

సోషల్‌ మీడియా ఎరాలో ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్‌ అవుతారో ఊహించలేం. అలాగే ఆ వచ్చిన ఫేమ్‌ ఎంత త్వరగా పోతుందో కూడా చెప్పలేం. అయితే ఆ ఫేమ్‌ను కలకాలం గుర్తుండిపోయేలా చేసుకునేవాళ్లు కొందరే. ఈ క్రమంలో మనషులే కాదు.. మూగ జీవాలు సైతం విపరీతంగా ప్రజాదరణ పొందుతున్నాయి. అలా ఇంటర్నెట్‌లో నవ్వుల పువ్వులు పూయించిన ఓ శునకం ఇక లేదు అనే వార్త ఇంటర్నెట్‌తో కన్నీళ్లు పెట్టిస్తోంది. 


ఇంటర్నెట్‌లో ఇంతకాలం నవ్వులు పూయించిన  చీమ్స్‌(Cheems) అనే శునకం ఇక లేదు.  కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న ఆ కుక్క.. శనివారం ఉదయం సర్జరీ జరుగుతున్న టైంలో ప్రాణం విడిచింది.   ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన దాని యాజమాని.. దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇంతకీ ఈ షిబా ఇనూ జాతి కుక్కకి..  మన తెలుగులో చింటుగాడు, చీమ్స్‌మావా అనే ట్యాగ్‌ కూడా ఉంది. 

చీమ్స్‌(Cheems Dog) అసలు పేరు బాల్టెజ్‌.  ఏడాది వయసున్నప్పుడు హాంకాంగ్‌కు చెందిన ఓ కుటుంబం దాన్ని దత్తత తీసుకుంది. ఓ ఫొటోగ్రాఫర్‌ కారణంగా దీని ఫొటోలు ఇంటర్నెట్‌కు చేరాయి. 2013 చివర్లో విపరీతంగా దాని ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అంతేకాదు.. ఆ ఏడాది టాప్‌ మీమ్‌గా చీమ్స్‌కు గుర్తింపు కూడా దక్కింది. 

మరీ ముఖ్యంగా కరోనా టైం నుంచి చీమ్స్‌ హవా నడిచింది. కోకొల్లలుగా మీమ్స్‌ పుట్టుకొచ్చాయి చీమ్స్‌పై. ఆ మహమ్మరి టైంలో మానసికంగా కుంగిపోయిన ఎంతో మందికి నవ్వులు పంచింది ఈ శునకం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చింటు పేరు మీద ఇప్పటికీ రకరకాల వెర్షన్‌లతో(అందులో డబుల్‌ మీనింగ్‌వే ఎక్కువ) మీమ్స్‌ కనిపిస్తుంటాయి. 

చీమ్స్‌ లేకపోతేనేం.. దాని మీమ్స్‌.. అది పంచిన నవ్వులతో ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఎప్పటికీ సజీవంగా ఉంటుందనేది అభిమానుల మాట. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)