Breaking News

వెయిట్రస్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్క పంచ్‌తో శివంగిలా విరుచుకుపడి..

Published on Mon, 04/17/2023 - 18:54

ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఎటు నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలియదు. ఆపద కాలంలో మనల్ని ధైర్యంగా ఉంచడమే కాకుండా.. ప్రత్యర్థి, ఆగంతకుల బారి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ తోడ్పడుతుంది. అచ్చం ఇలాంటి కోవకే చెందిన ఓ ఘటన రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు ఓ మహిళ వెయిట్రస్‌ దిమ్మతిరిగే పంచ్‌లతో సమాధానమిచ్చింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రెస్టారెంట్‌లోని టేబుల్‌ వద్ద ఇద్దరు వ్యక్తుల కూర్చొని ఉండగా.. వారి ముందు ఓ లేడీ వెయిట్రస్‌ నిల్చొని ఉంది. టేబుల్‌లో కొన్ని ఖాళీ బీర్‌ సీసాలు కూడా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు కస్టమర్లలో ఒక వ్యక్తి నిలబడి వెయిట్రస్‌ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. అంతటితో ఆగకుండా అతని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కడుపులో తన్ని కింద పడేసింది.

ఇది చూసిన రెండో వ్యక్తి మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయినా బెదరని వెయిట్రస్‌ అతన్ని ధైర్యంగా ఎదుర్కొంది. సినిమాలో హీరోకు ఏమాత్రం తీసిపోకుండా  అతనిపై శివంగిలా విరుచుకుపడింది. ఆమె పైకి కుర్చీ విసరగా.. యువతి తన కాలితో ఒక్క కిక్‌ ఇవ్వగానే ఎగిరి కిందపడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

దీనిని ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఫేర్‌ చేయగా.. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా యువతి ధైర్య సాహసాలను చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ పోకిరీలతో పోరాడిన యువతిని ‘ఫిమేల్ బ్రూస్ లీ’ అంటూ కొనియాడుతున్నారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)