Breaking News

Viral Video: లైవ్‌ టీవీ డిబెట్‌లో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న నేతలు

Published on Fri, 09/29/2023 - 14:17

టీవీలో ప్రసారమయ్యే లైవ్‌ డిబెట్ల గురించి తెలిసిందే. రాజకీయాలు, సామాజిక అంశం, ప్రస్తుతం విషయాల మీద కొంతమంది వ్యక్తులు, అనుభవజ్ఞులను తీసుకొచ్చి మాట్లాడిస్తుంటారు. పొలిటికల్‌ లీడర్స్‌ ఎక్కువగా ఈ డిబెట్‌లో పాల్గొంటుంటారు. చర్చల్లో భాగంగా వారి మధ్య వాదనలు, ఆరోపణలు, విమర్శలు, అప్పుడప్పుడు పరిస్థితులు చేయి దాటి పోవడంతో భౌతిక దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. 

తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ ఛానల్‌ లైవ్‌ డిబెట్‌లో పాల్గొన్న ఇద్దరు నేతలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఏకంగా ఒకరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. వివరాలు.. జావేది చౌదరి హోస్ట్‌ చేసిన టాక్‌ షో ‘కల్‌ తక్‌)లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీకి న్యాయవాది షేర్‌ అఫ్జల్‌ మార్వత్‌,  మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌ను పార్టీ సెనేటర్‌ అయిన  అఫ్నాన్‌ ఉల్లా పాల్గొన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌పై సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో సహనం కోల్పోయిన షేర్‌ అఫ్జల్‌ మార్వత్‌  తన కుర్చీలో నుంచి లేచి అఫ్నాతుల్లా ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఖాన్‌ కూడా మార్వత్‌పై ప్రతిదాడికి దిగాడు. ఇద్దరూ కిందపడిమరీ కొట్టుకున్నారు. పరిస్థితి మరింత దిగజారిపోవడంతో చివరికి వీరిని యాంకర్‌, సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దాడిలో అఫ్నాన్ ఉల్లా ఖాన్ తలకు గాయమైంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా సేపటి వరకు గొడవ కొనసాగడంతో ఈ దృశ్యాలను లైవ్‌గా చూశారు. గౌరవ హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా తన్నుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రవర్తించి తమ పరువును దిగజార్చుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)