Breaking News

షాకింగ్ ఘటన.. కోర్టులోనే జడ్జిపై దాడి చేసిన నిందితుడు

Published on Thu, 01/04/2024 - 16:36

లాస్ వెగాస్: అమెరికాలోని కోర్టులో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బెయిల్‌ నిరాకరించారన్న కోపంతో నిందితుడు తీర్పు చెబుతున్న జడ్జిమీదకు దూసుకెళ్లి దాడి చేశాడు. ఈ  అనూహ్య పరిణామం లాస్‌ వెగాస్‌లోని కోర్టు హాలులో బుధవారం జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కోర్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. 

యూఎస్‌ వార్తా పత్రిక న్యూయార్క్‌ పోస్టు ప్రచురించిన వివరాల ప్రకారం.. లాస్‌ వెగాస్‌లోని క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టులో క్రిమినల్ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితుడు 30 ఏళ్ల డియోబ్రా రెడెన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు మహిళా జడ్జి మేరి కే హోల్ధస్‌ నిరాకరించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మళ్లీ నేరం చేయకుండా సరైన శిక్ష పడాల్సిందేనని  తెలిపారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఒక్కసారిగా జడ్జి బెంచ్‌ వద్దకు దూసుకొచ్చాడు. న్యాయమూర్తి వద్దకు దూకి దాడి చేశాడు. పిడికిలితో పదేపదే కొట్టడంతో సాయం కోసం ఆమె కేకలు వేసింది.

ఆమె పక్కనే ఉన్న క్లర్క్‌, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే నిందితుడి దాడిలో జడ్జి సహా ఆమె సహాయకుడికి స్పల్పంగా గాయాలయ్యాయి. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. నిందితుడి చర్యతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్‌చేసి అతడిపై కొత్త నేరారోపణలు మోపి జైలుకు తరలించారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు