Breaking News

డెల్టా ఫోర్స్‌దే కీలక పాత్ర 

Published on Sun, 01/04/2026 - 01:53

వాషింగ్టన్‌:  వెనెజువెలాపై దాడుల్లో అమెరికా డెల్టా ఫోర్స్‌ కీలక పాత్ర పోషించింది. ఇది అమెరికా సైన్యంలో అత్యున్నత ప్రత్యేక మిషన్‌ యూనిట్‌. 1977లో డెలాŠట్‌ దళాన్ని స్థాపించారు. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్‌ బ్రాగ్‌ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థత కలిగిన, రహస్య మిలటరీ యూనిట్‌గా డెల్టా ఫోర్స్‌కు పేరుంది. 

యూఎస్‌ ఆర్మీ స్పెషల్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. జాయింట్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌కు జవాబుదారీగా ఉంటోంది. అమెరికా సైనికాధికారి కల్నల్‌ చార్లెస్‌ బెక్‌విత్‌ బ్రిటన్‌కు చెందిన 22వ స్పెషల్‌ ఎయిర్‌ సరీ్వసెస్‌ రెజిమెంట్‌ను స్ఫూర్తిగా తీసుకొని డెల్టా దళాన్ని స్థాపించారు. ఈ దళం డెల్టా అని కాకుండా కొన్ని సందర్భాల్లో వేర్వేరు పేర్లతో ఆపరేషన్లు నిర్వహిస్తోంది.  

ఉగ్రవాదులపై ఆపరేషన్ల కోసం..  
డెల్టా ఫోర్స్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధిక రిస్‌్కతో కూడిన భారీ ఆపరేషన్లకు ఈ దళాన్ని రంగంలోకి దించుతారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, బందీలను విడిపించడం, ఉగ్రవాద ముప్పును నిర్మూలించడం, ఉగ్రవాదులను ప్రాణాలతో అదుపులోకి తీసుకోవడం వంటివి ప్రధాన బాధ్యతలు. ఉగ్రవాదులపై పోరాటం కోసం సృష్టించిన దళాన్ని వెనెజువెలాలో సైనిక ఆపరేషన్‌కు ఉపయోగించడం గమనార్హం. సంప్రదాయేతర యుద్ధ రీతుల్లోనూ ఈ దళానికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. విమానాలు, నౌకలు, రైళ్లు, ఇతర వాహనాల్లో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడంలో డెల్టా దళానికి గుర్తింపు ఉంది. 

అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని చేస్తుంది. డెల్టా ఫోర్స్‌ చేపట్టిన ఆపరేషన్ల గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. చాలావరకు ఆపరేషన్లు రహస్యంగానే పూర్తయిపోయాయి. 2001లో ఆపరేషన్స్‌ ప్రైమ్‌ చాన్స్‌ను ఈ దళం నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ కోసం వేట సాగించింది. 2019లో ఐసిస్‌ ఉగ్రవాది అబూ బాకర్‌ అల్‌–బగ్దానీని అంతం చేసింది. డెల్టా ఫోర్స్‌లో చేరడం అంత సులభం కాదు. యూఎస్‌ ఆర్మీ స్పెషల్‌ ఫోర్సెస్, 75వ రేంజర్‌ రెజిమెంట్‌ నుంచి జవాన్లను ఈ దళంలోకి తీసుకుంటారు. అందుకోసం రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి సమర్థత, అంకితభావం ఉన్నవారికే డెల్టా దళంలో ప్రవేశం లభిస్తుంది.   
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)