కూటమి భయపడే ఇలా చేస్తుంది
Breaking News
ట్రంప్ ముఖచిత్రంతో బంగారు డాలర్
Published on Thu, 07/16/2026 - 05:25
వాషింగ్టన్: అమెరికా 250 ఏళ్ల అవతరణ వేడుకలను పురస్కరించుకుని ముద్రించ తలపెట్టిన దేశాధ్యక్షుడు ట్రంప్ ముఖచిత్రంతో కూడిన ఒక డాలర్ బంగారు నాణెం ఫొటోలను అమెరిక ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ బుధవారం విడుదల చేశారు. అమెరికా దేశభక్తికి, స్వేచ్ఛకు ఇవి చిహ్నాలని ఆయన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలతో నాణేలను ముద్రించడంపై నిషేధముంది.
అయితే, అమెరికా 250వ వార్షికోత్సవ ప్రత్యేక డిజైన్ల చట్టం–2020 ప్రకారం ఈ నాణెం విడుదలకు చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవని ఆర్థికమంత్రిత్వ శాఖ చెబుతోంది. నాణెం ముద్రణ ఇప్పటికే మొదలైందని, త్వరలో మార్కెట్లోకి విడుదలవుతుందని తెలిపింది. గతంలో 1926లో అమెరికా 150వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి 30వ అధ్యక్షుడు కాలి్వన్ కూలిడ్జ్ తన సొంత చిత్రం, జార్జ్ వాషింగ్టన్ చిత్రంతో కూడిన అర–డాలర్ నాణేన్ని విడుదల చేశారు.
Tags : 1