Breaking News

చైనా అరాచకం.. భారత సరిహద్దుల్లో రహస్య అణు పరీక్షలు

Published on Sat, 02/07/2026 - 20:25

వాషింగ్టన్‌: భారత్‌ సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో చైనా రహస్యంగా జరిపిన అణు పరీక్షలపై అమెరికా సంచలన విషయాలను వెల్లడించింది. 2020లో భారత్, చైనాల మధ్య గాల్వాన్‌లో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం.. చైనా రహస్యంగా అణు పరీక్షలను నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. దీంతో, అమెరికా వెల్లడించిన వివరాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో శుక్రవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా థామస్‌.. అణు పరీక్షల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత వారం రోజుల వ్యవధిలో జిన్ఙియాంగ్ ప్రావిన్సుల్లోని లోప్ నూర్ సైట్‌లో చైనా అణు పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా భూమి కంపనాలను గుర్తించడం కష్టంగా ఉండేందుకు ‘‘డీకప్లింగ్’’ అనే టెక్నాలజీని చైనా ఉపయోగించినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు.

కాగా, డీ కప్లింగ్ అంటే భూగర్భంలో అతిపెద్ద గుహలో పరీక్షలు నిర్వహించడం. దీని వల్ల ఏర్పడే భూకంప తరంగాలు గుహలోనే అబ్సార్వ్ అవుతాయి. అయితే, ప్రపంచం కళ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహిస్తోందనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. జూన్ 22, 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని అమెరికా నిపుణులు చెబుతున్నారు.  

ఇదిలా ఉండగా.. గాల్వాన్ ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ క్రమంలో చైనాపై భారత్‌ జరిపిన దాడిలో 35-40 మంది చనిపోయినట్లు యూఎస్ నివేదికలు చెబుతున్నాయి. చైనా తన సైనికుల మరణాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గాల్వాన్‌ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత 2024లో ఈ ప్రతిష్టంభన ముగిసింది.

చైనాపై ఎందుకు అనుమానం?
చైనా తన అణ్వాయుధాలను పెంచుకోవడంపై అమెరికా ఆందోళన చెందుతోంది. బీజింగ్ వద్ద సుమారు 600 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని నమ్ముతున్నారు. గత సంవత్సరం, నవంబర్‌లో చైనా, పాకిస్తాన్ అణు పరీక్షలు చేసిన సమయంలో అమెరికా సైన్యాన్ని అణు ఆయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించారు. మరోవైపు రష్యా కూడా అణు పరీక్షలు చేస్తోందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు రష్యాతో భవిష్యత్తులో కుదిరే ఏ అణు ఒప్పందంలోనైనా చైనా కూడా భాగం కావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మరోవైపు.. అమెరికా, రష్యా మధ్య చివరి అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసిన తర్వాత ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)