USA Presidential Elections 2024: ట్రంప్‌ హత్యకు కుట్ర!

Published on Thu, 08/08/2024 - 06:33

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యరి్థ డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేయడానికి జరిగిన కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు  అడ్డుకున్నారు. ట్రంప్‌తోపాటు మరికొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను అంతం చేయడానికి స్కెచ్‌ వేసిన పాకిస్తాన్‌ పౌరుడు అసిఫ్‌ మర్చెంట్‌(46)ను  జూలై 12న అరెస్ట్‌ చేశారు. 

అతడిపై హత్య కేసు నమోదుచేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసిఫ్‌ మర్చెంట్‌కు ఇరాన్‌ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్టులో అధికారులు సమరి్పంచిన పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది. 

జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌తో అసిఫ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎఫ్‌బీఐ అధికారులు స్పష్టంచేశారు. ట్రంప్‌తోపాటు ఇతర పెద్దలను హత్య చేయడానికి అసిఫ్‌ నియమించుకున్న కిరాయి హంతకుడే అధికారులకు ఉప్పందించి, అతడిని చట్టానికి పట్టివ్వడం గమనార్హం.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)