Breaking News

గాజా ఆక్రమణ ఉండదు

Published on Tue, 09/30/2025 - 05:41

వాషింగ్టన్‌: గాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. గాజాను ఇజ్రాయెల్‌ ఆక్రమించబోదని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సోమవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి, శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని అన్నారు.

ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసినందుకు నెతన్యాహుకు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినం అని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్‌తోపాటు ఇతర భాగస్వామ్యపక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చిచెప్పారు. నెతన్యాహు మాట్లాడుతూ... గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రాంతీయ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే విషయంలో నెతన్యాహుతో చర్చలు ఒక భాగమేనని ట్రంప్‌ పేర్కొన్నారు.  

ఖతార్‌ ప్రధానమంత్రికి నెతన్యాహు క్షమాపణ 
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఖతార్‌ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌–థానీకి ఫోన్‌ చేసి క్షమాపణ కోరారు. ఇటీవల ఖతార్‌ రాజధాని దోహాపై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం ముస్లిం దేశాల్లో అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్‌ తీరును ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన నెతన్యాహు అక్కడి నుంచే ఖతార్‌ ప్రధానికి ఫోన్‌చేశారు. దోహాపై దాడుల పట్ల విచారం వ్యక్తంచేశారు. క్షమాపణ కోరారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)