Breaking News

అమెరికాలోకి రాకుండా మరో 20 దేశాలపై నిషేధం 

Published on Thu, 12/18/2025 - 04:21

వాషింగ్టన్‌: అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్‌ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు. బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. 

మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే  పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

‘ఈ దేశాలకు అమెరికా చట్టంపై గౌరవం లేదు. తన పౌరుల గురించిన సమగ్ర సమాచారం పొందుపరచడంలో అమెరికా నిఘా, భద్రతా, ఇమ్మిగ్రేషన్‌ విభాగాలకు అందించడంలో తరచూ విఫలమవుతున్నాయి‘ అని తెలిపారు. పాలస్తీనా అథారిటీ తాలూకు పత్రాలున్న వారి ప్రవేశాన్ని నిషేధించారు. వెస్ట్‌ బ్యాంక్, గాజాల్లో పలు ఉగ్ర మూకలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అమెరికా పౌరులను పొట్టన పెట్టుకున్నాయి. అందుకే ఈ చర్య’ అని వైట్‌ హౌస్‌ పేర్కొంది. 

వాటిపై కొనసాగింపు 
అఫ్గానిస్తాన్, బర్మా సహా 12 దేశాలపై ఇటీవలే అమెరికా నిషేధం విధించడం తెలిసిందే. అది ఇకముందు కూడా కొనసాగనుంది. గత నెలలో ఒక అఫ్గాన్‌ దేశస్తుడు వాషింగ్టన్‌లో ఇద్దరు నేషనల్‌ గార్డ్‌ సిబ్బందిని కాల్చి చంపడం తెలిసిందే. ఆ నేపథ్యంలో అఫ్గాన్‌తో పాటు ఇలా పలు మూడో ప్రపంచ దేశాలపై అమెరికా కఠిన నిషేధాలు విధిస్తూ వస్తోంది. 
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)