Breaking News

మాక్రాన్‌పై ఇటు ఇజ్రాయెల్‌, అటు అమెరికా ఆగ్రహం

Published on Fri, 07/25/2025 - 10:51

పాలస్తీనాను దేశంగా గుర్తించాలన్న ఫ్రాన్స్‌ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ తీవ్రంగా తప్పుబట్టాయి. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకోగా.. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే..

మాక్రోన్‌ నిర్ణయాన్ని ఇటు ఇజ్రాయెల్‌, అటు అమెరికా ఖండించాయి. ఇది అక్టోబర్‌ 7వ తేదీ నాటి బాధితులకు ద్రోహం చేయడంలాంటిదేనని అమెరికా విదేశాంగ కార్యదర్శి మాక్రో రుబియో అన్నారు. మాక్రోన్‌ నిర్ణయాన్ని సిగ్గుచేటుగా పేర్కొన్న రుబియో.. ఇది హమాస్‌కు అనుకూలంగా ఉందంటూ మండిపడ్డారు.

ఐరాస సాధారణ అసెంబ్లీలో పాలస్తీనాకు దేశం గుర్తింపు కోసం ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఖండించదగ్గవి. 2023 అక్టోబవర్‌ 7వ తేదీన ఇస్లామిక్‌ గ్రూప్‌ హమాస్‌ దాడులతోనే గాజాకు ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి సంస్థకు మద్దతుగా ఫ్రాన్స్ నిర్ణయం ఉంది. ఇది సిగ్గుచేటు అని రుబియో ట్వీట్‌ చేశారు.

మరోవైపు.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందిస్తూ పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వడమంటే.. అది ఉగ్రవాదానికి బహుమతి ఇచ్చినట్లేనని అన్నారు. పైగా ఇది ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే అంశమేనని అభిప్రాయపడ్డారాయన.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 142 దేశాలు పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే యూరప్‌ దేశం నుంచి ఈ డిమాండ్‌ చేస్తున్న పవర్‌ఫుల్‌ దేశంగా ఇప్పుడు ఫ్రాన్స్‌ ఈ జాబితాలో నిలిచింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తీవ్ర మానవ సంక్షోభం తలెత్తడంపై ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు దాడులు.. మరోవైపు సాయం అందకుండా ఈ పరిస్థితికి ఇజ్రాయెల్‌ కారణమైందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది(ఫ్రాన్స్‌ కూడా ఇదే గళం వినిపిస్తోంది). అయితే ఇజ్రాయెల్‌ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ఈ తరుణంలో ఫ్రాన్స్‌ నిర్ణయం ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశం లేకపోలేదు.  

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)