Breaking News

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. పుతిన్‌కు ఫోన్‌!

Published on Fri, 11/15/2024 - 11:18

వాషింగ్టన్: గత రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య పోరులో ఇప్పటికే వేల సంఖ్యలో సామన్య పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్‌ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించాను. గత రెండున్నరేళ్లలో వేలాదిమంది మరణించారు. నేను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధాన్ని ఆపేస్తాను. అలాగే, పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్‌ ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ఈవిషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడి.. యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికైనా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య దాడులు నిలిచిపోవాలని దేశాలు కోరుతున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)