Breaking News

గాజాపై ట్రంప్‌ సంచలన ప్రకటన

Published on Wed, 02/05/2025 - 07:40

వాషింగ్టన్‌: గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ట్రంప్‌.. ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్‌ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్‌ యుద్ధంపై ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు దిశగా వెళ్లాలని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్‌ చర్చించారు. అనంతరం ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి  ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు అని తెలిపారు. ఇదే సమయంలో భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు.. ట్రంప్‌ నిర్ణయంపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందించారు. గాజాపై ట్రంప్‌ ప్రకటన చరిత్రను మారస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఇరువురి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇదిలా ఉండగా.. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్‌ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం  దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్‌, సౌదీఅరేబియా, యూఏఈ, ఖతార్‌, పాలస్తీనా అథారిటీ, అరబ్‌ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈక్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేస్తామని ట్రంప్‌ ప్రకటించడం గమనార్హం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)