Breaking News

ట్రంప్‌ దూకుడు.. తొలి రోజే సంచలన నిర్ణయాలు

Published on Tue, 01/21/2025 - 07:33

President Donald Trump Key Decisions Updates..

అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

నలుగురు అధికారులపై ట్రంప్‌ వేటు..

  • అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్‌ దూసుకెళ్తున్నారు.
  • నలుగురు అధికారులపై ట్రంప్‌ వేటు వేశారు.
  • అలాగే, ‘వెయ్యి మందికి’ హెచ్చరికలు మంజూరు
  • తన అధ్యక్ష కార్యాలయం ప్రస్తుతం వడపోత పనులు చూస్తోందని ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ట్రంప్‌
  • మునుపటి అధ్యక్షుడి కాలంలో నియమితులైన వెయ్యి మందిపై వేటు పడనుందని వెల్లడి
  • ‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలి’ అనే మా విధానానికి అనుగుణంగా లేని వారంతా విధుల్లో కొనసాగలేరని వ్యాఖ్యలు

ఖడ్గం పట్టుకుని ట్రంప్‌ డ్యాన్స్

  • అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్‌ డ్యాన్స్‌
  • అమెరికా మిలటరీకి చెందిన ఖడ్గంతో ట్రంప్‌ డ్యాన్స్‌ చేశారు.
  • ట్రంప్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‌

 

భారతీయులకు ట్రంప్‌ ఝలక్‌?

  • విదేశీ మహిళలు అమెరికాలో ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్‌
  • పేరెంట్స్‌లో ఒకరికైనా యూఎస్‌ సిటిజన్‌షిప్‌, శాశ్వత నివాసి, యూఎస్‌ మిలిటరీ సభ్యత్వం ఉండాలి.
  • ఇలా ఏదో ఒక గుర్తింపు ఉండాలని నిబంధన విధించిన ట్రంప్‌
  • 2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 5.4 మిలియన్ల భారతీయ అమెరికన్లు
  • యూఎస్‌ జనాభాలో 1.47 శాతం మంది భారతీయులే. 
  • ఇక, చైనీయులు కూడా అమెరికాలో భారీ సంఖ్యలోనే ఉన్నారు. 
  • దీంతో, వారు కూడా అమెరికాను వీడే అవకాశం ఉంది. 

 

పుతిన్‌కు హెచ్చరికలు..

  • ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై స్పందించిన ట్రంప్‌..
  • రష్యాను పుతిన్‌ నాశనం చేస్తున్నారన్న మండిపడిన ట్రంప్‌.
  • యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్‌ ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు అంగీకరించడం లేదని కామెంట్స్‌
  • పుతిన్‌ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని సూచన
  • లేకపోతే రష్యా గొప్ప ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని హెచ్చరిక

 

కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నులు: ట్రంప్‌

  • కెనడా, మెక్సికో షాకిచ్చిన ట్రంప్‌.
  • ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధింపు.
  • ఆ రెండు దేశాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయకపోతే పన్నుల విధింపు తప్పదని ఇది వరకే హెచ్చరించిన ట్రంప్‌
  • ఈ మేరకు తాజాగా ప్రకటన
  • అయితే, చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపు గురించి వెల్లడించని అమెరికా నూతన అధ్యక్షుడు

క్యాపిటల్‌ దాడి కేసులు రద్దు.. ట్రంప్‌ క్షమాభిక్ష

  • 2021 జనవరి 6న దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ఉపశమనం కల్పించిన ట్రంప్‌

  • కార్యాలయంలోకి వచ్చిన మొదటి రోజునే తనకున్న ప్రత్యేక అధికారాల వినియోగం

  • ఈ చర్యతో యూఎస్‌ న్యాయశాఖ చరిత్రలోనే అతిపెద్ద విచారణ, సుదీర్ఘ దర్యాప్తునకు ముగింపు

  • తన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఎన్నికల సమయంలోనే హామీ

  • డొనాల్డ్ ట్రంప్ దూకుడు..తొలి రోజే సంచలన..!

ట్రంప్‌ కీలక సంతకాలు ఇవే..

  • బైడెన్‌ ప్రభుత్వం జారీ చేసిన 80 విధ్వంసకర, రాడికల్ పరిపాలనా ఉత్తర్వులు రద్దు చేసిన ట్రంప్‌
  • ట్రంప్‌ యంత్రాంగంపై పట్టు సాధించేవరకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్తర్వులు
  • మిలిటరీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలు మినహా అన్ని సమాఖ్య నియామకాలు నిలిపివేత
  • పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన ట్రంప్‌
  • వాక్‌ స్వాతంత్ర్యంపై సెన్సార్‌ తొలగింపు

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఔట్‌..

  • అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. అమెరికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తొలగిస్తూ సంతకం. కోవిడ్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్‌ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. 

 

 మోదీ అభినందనలు..
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు. ట్విట్టర్‌ వేదికగా మోదీ..‘నా ప్రియ మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అభినందనలు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు, ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆయన పదవీకాలం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కామెంట్స్‌ చేశారు. 

ఉత్తర్వులే ఉత్తర్వులు! 
బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్‌ల పెంపు, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్‌హౌస్‌ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు.

ట్రంప్‌ రాకతో వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్‌ బ్యాక్‌’ అనే హెడ్డింగ్‌తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్‌ సందేశాన్ని హోం పేజీలో హైలైట్‌ చేసింది. ట్రంప్‌ తాజా నిర్ణయాలను పోస్ట్‌ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్‌ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)