Breaking News

భారత్‌పై సుంకాలు.. అతి పెద్ద సవాల్‌ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు

Published on Sat, 09/13/2025 - 08:15

వాషింగ్టన్‌: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై 50 శాతం సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని చెప్పుకొచ్చారు. ఈ అతి పెద్ద చర్య కారణంగానే భారత్‌, అమెరికా మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ ప్రారంభమైంది. భారత్‌పై సుంకాలను తగ్గిస్తారా? అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యాకు భారత్‌ అతి పెద్ద చమురు వినియోగదారు. రెండు దేశాల మధ్య ఎంతో మిత్రుత్వం ఉంది. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్‌తో విభేదానికి  మేము సిద్ధమయ్యాం. రష్యా నుంచి చమురు కొంటున్నారు అనే కారణంతోనే భారత్‌పై నేను భారత్‌పై 50 శాతం సుంకం విధించాను. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్‌తో విభేదాలు వచ్చాయి. అయినా నేనా చర్య తీసుకున్నాను. ఇలాంటి ఎన్నో పనులు చేశాను. కేవలం ఇది మాకు మాత్రమే సమస్య కాదు. యూరప్‌కు సైతం ఇదే ప్రధాన సమస్యే’ అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో పాత పాటే మళ్లీ పాడారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌-పాక్‌ ఘర్షణ సహా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఏడు యుద్ధాలను తాను నివారించినట్టు ట్రంప్‌ తెలిపారు. కాంగో, రువాండా మధ్య గత 31ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని తానే పరిష్కరించానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించలేని యుద్ధాలను నేను పరిష్కరిస్తాను ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)