Breaking News

ట్రంప్‌ వచ్చేశారు.. అదంతా ఫేక్‌ ప్రచారమే..

Published on Sun, 08/31/2025 - 08:01

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చనిపోయారంటూ, కనిపించడం లేదంటూ వస్తున్న వార్తలకు తెర పడింది. ఎట్టకేలకు అధ్యక్షుడు ట్రంప్‌.. దర్శనమిచ్చారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ కీలక ప్రకటన చేసింది. తాజాగా ట్రంప్ త‌న వ‌ర్జీనియా క్ల‌బ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో వైట్‌హౌస్‌ షేర్ చేసింది. దీంతో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు క్లారిటీ వచ్చేసింది.

ఇక, వైట్‌హౌస్‌ ఈ సందర్బంగా స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన హుషారుగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారని పేర్కొంది. ట్రంప్‌ తన మనుమరాలు కయి ట్రంప్‌, మనువడు ఫ్రెడరిక్‌ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడేందుకు వెళ్లారని తెలిపింది. ఇక, ఫోటోలో ట్రంప్ తెల్లటి పోలో షర్ట్, రెడ్ కలర్ టోపీ, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి, అమెరికా గ్రేట్‌ క్యాప్‌ ధరించి కనిపించారు. కాగా, తెల్లవారు జామున ఉదయం 8.49 గంటలకు ట్రంప్ గోల్ఫ్ ఆడినట్టు టైం స్టాంప్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఫేక్‌ అని తేల్చేశారు.

ఇదిలా ఉండగా.. అ‍మెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో, ట్రంప్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యారు. మీమ్స్‌, వీడియోలు చక్కర్లు ​కొట్టాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)