Breaking News

లక్ష డాలర్ల  వీసా ఫీజుకు అమెరికా కోర్టు బ్రేక్‌! 

Published on Sun, 07/26/2026 - 05:45

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాల కోసం చెల్లించాల్సిన ఫీజులను లక్ష డాలర్లకు పెంచాలన్న ట్రంప్‌ నిర్ణయం బెడిసికొట్టింది. ఫీజు పెంపును తిరస్కరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసేందుకు ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సమర్థించింది. యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి లియో టి సొరోకిన్‌ జూన్‌ 8వ తేదీ ఒక తీర్పునిస్తూ హెచ్‌–1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం అక్రమమని, కాంగ్రెస్‌ ఆమోదం లేదని స్పష్టం చేశారు. అయితే అమెరికన్‌ ప్రభుత్వం ఈ తీర్పును అప్పీల్స్‌ కోర్టులో సవాలు 
చేసింది. 

బోస్టన్‌లోని ఫస్ట్‌ సర్క్యూట్‌ అప్పీల్‌ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ దీనిపై విచారణ జరిపి డిస్ట్రిక్ట్‌ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులో
కక్షిదారులైన ఇరవై రాష్ట్రాల డెమోక్రాట్‌ ప్రభుత్వాల వాదన సరైందేనని స్పష్టం చేసింది. 1989 సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ, ఎగ్జిక్యూటివ్‌ శాఖ ఆర్థిక భారాలు (ఫీజులు లేదా పన్నులు) విధించాలంటే కాంగ్రెస్‌ స్పష్టమైన అనుమతి అవసరం అని పేర్కొంది. ఈ ఫీజు వల్ల రాష్ట్రాలకు పెద్ద నష్టం జరగదని కేంద్రం వాదించినా, కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.  

2025 సెపె్టంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త హెచ్‌–1బీ వీసాలకు 100,000 అమెరికన్‌ డాలర్ల ఫీజును ప్రకటించిన విష యం తెలిసిందే. భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో స్థిరపడేందుకు ఈ హెచ్‌–1బీ వీసాను ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ప్రత్యేక నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికన్‌ కంపెనీలకు ఈ వీసా అవకాశమిస్తుంది. అమెరికన్‌ టెక్‌ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి సుమారు 65 వేల మందిని ఈ వీసా ద్వారా నియమిస్తాయి. అధిక విద్యార్హత కలిగిన విదేశీ ఉద్యోగులు మరో 20 వేల మంది కూడా ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలకు అర్హులవుతూంటారు. సాధారణంగా ఈ వీసాల ఫీజులు 2,000–5,000 డాలర్ల వరకూ ఉంటాయి.  
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)